Lava AGNI 4: లావా AGNI సిరీస్‌లో కొత్తగా Lava AGNI 4 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. 6.67 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి హై-క్వాలిటీ డిస్‌ప్లే లక్షణాలతో ఇది మరింత మెరుగైన విజువల్ అనుభవాన్ని ఇస్తుంది. MediaTek Dimensity 8350 (4nm) ప్రాసెసర్, 4300mm² VC లిక్విడ్ కూలింగ్, గేమ్ బూస్టర్ మోడ్ వంటి ఫీచర్‌లు ఫోన్‌ను హై-పర్ఫార్మెన్స్ సెగ్మెంట్‌లో నిలబెడతాయి. 8GB LPDDR5X ర్యామ్ తోపాటు.. అదనంగా 8GB వర్చువల్ ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజ్ వంటి స్పెసిఫికేషన్లు వేగం, మల్టీటాస్కింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి.
Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోడీ..
ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ Vayu AI. ఇది సాధారణ వాయిస్ అసిస్టెంట్ కాకుండా సిస్టమ్-లెవల్ “ఎమోషనల్ AI కంపానియన్”. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ AIలో విద్య కోసం మాథ్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్లు, లైఫ్‌స్టైల్ కోసం AI హోరోస్కోప్, కన్వెర్సషనల్ కంపైన్స్, అలాగే ప్రొడుక్టివిటీ అండ్ క్రియేటివిటీ కోసం కాల్ సమ్మరీ, టెక్స్ట్ అసిస్టెంట్, డాక్యుమెంట్ ఎనాలిసిస్, AI ఇమేజ్ జనరేటర్, AI ఫోటో ఎడిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కెమెరా సెక్షన్‌లో 50MP OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, ఫ్రంట్‌లో 50MP కెమెరాతో 4K@60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ లభిస్తుంది. అల్యూమినియం అల్లాయ్ బాడీ, సూపర్ యాంటీ డ్రాప్ డైమండ్ నిర్మాణం ఫోన్‌కు అదనపు మన్నికను ఇస్తాయి.
Eric Trump: జోహ్రాన్ మమ్దానీ ‘‘భారతీయ’’ ద్వేషి.. ట్రంప్ కుమారుడి సంచలన వ్యాఖ్యలు..
5000mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ 0-50% వరకు కేవలం 19 నిమిషాల్లో చార్జ్ అవుతుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సర్, IP64 రేటింగ్, స్టీరియో స్పీకర్లు, USB-C 3.2 వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15తో పాటు మూడు సంవత్సరాల OS అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను లావా హామీ ఇస్తోంది. Lava అగ్ని 4 ధర రూ. 24,999గా నిర్ణయించబడింది. ఫాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ కలర్లలో లభ్యమయ్యే ఈ మోడల్ అమెజాన్ లో నవంబర్ 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది. లాంచ్ రోజున అన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులకు 2,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది.
The wait ends today.
Agni 4 launch event starts today at 12 PM.
Watch it LIVE on YouTube: https://t.co/igQcR3gDgW#Agni4 #VayuAI #FireForMore #LavaMobiles pic.twitter.com/sV9DWWOqrL— Lava Mobiles (@LavaMobile) November 20, 2025
Lava Agni 4 Specs:
⭕ 6.67” 1.5K 120hz Flat AMOLED Display, 2600nits peak, GG 5 Protection, 1.7mm bezels
⭕ Dimensity 8350
⭕ 8GB LPDDR5x RAM | 256GB UFS 4.0 Storage
⭕ 5000mAh + 66W
⭕ 50MP (1/1.55") Main + 8MP UW
⭕ 50MP JN1 🤳
⭕ Action Key
(1/2)#LavaAgni4 #Agni4 pic.twitter.com/khAOZzdA0H— Tushar Gupta (@TusharG98540565) November 12, 2025