NTV Telugu Site icon

JIO Phone Next: రూ,4499కే జియో ఫోన్ నెక్స్ట్

Jio Next

Jio Next

టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియోగదారులను 4G సేవలను ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి జియోఫోన్ ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది.

జియోఫోన్ తర్వాత జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ జియోఫోన్ నెక్స్ట్‌ను ఎక్సచేంజ్ ఆఫర్‌లలో భాగంగా కేవలం రూ.4,499 ధర వద్దకే అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ తక్కువకాలం మాత్రమే అందుబాటులో వుంటుంది. ఎక్స్ఛేంజ్ విభాగంలో పాత డివైస్ లలో 4G స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లు లేదా ఇతర ఫంక్షనల్ స్మార్ట్‌ఫోన్‌లను వాడవచ్చునని సంస్థ తెలిపింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ వద్దనుకుంటే మాత్రం జియోఫోన్ నెక్స్ట్‌ను రూ.6,499 ధర వద్ద పొందవచ్చు. వినియోగదారులు నెలకు రూ.2,500 ముందస్తుగా చెల్లించే ఫైనాన్సింగ్ ఎంపికలలో కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ. 501 ప్రాసెసింగ్ రుసుము కూడా ఉంటుంది.

జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు

* గూగుల్ సపోర్ట్ వాయిస్ అసిస్టెంట్’, ‘రీడ్ అలౌడ్’ మరియు ‘ట్రాన్స్‌లేట్’ సౌకర్యం
* 5.45-అంగుళాల మల్టీటచ్ HD+ (720×1440 పిక్సెల్‌లు) డిస్‌ప్లే
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* డ్యూయల్ 4G సిమ్ స్లాట్
* 3500mAh బ్యాటరీ
*13MP సెన్సార్‌తో వెనుక భాగంలో ఒకే ఒక సింగిల్ కెమెరా
* ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరా
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 215 SoC
* 2GB వరకు RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌
*మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 512GB వరకు విస్తరించుకునే అవకాశం
* 10 భాషల సపోర్ట్‌తో పాటు ట్రాన్స్‌లేట్ నౌ, నియర్ బై షేర్
* రీడ్ ఎలౌడ్ వంటి ఫీచర్లు
* బ్లూటూత్ 4.1, డ్యూయల్-సిమ్ సపోర్ట్
* 3.5mm హెడ్‌ఫోన్ జాక్, Wi-Fi మరియు మైక్రో-USB

Vivo X80 : భారత విపణిలోకి వివో ఎక్స్‌80.. ఫీచర్స్‌ అదుర్స్‌..