మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Itel Zeno 100 Pro: భారత మార్కెట్లో తన ఉనికిని కంపెనీ త్వరలో Itel Zeno 100 Proతో పాటు Itel Zeno 100 Lite స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్లకు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్లను విడుదల చేసిన కంపెనీ.. కొన్ని కీలక ఫీచర్లను తెలిపింది. ముఖ్యంగా ఈ రెండు ఫోన్లలో డ్యూరబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనపడుతుంది. ఈ ఫోన్లో MIL-STD 810H Military-Grade Durability సర్టిఫికేషన్‌ను అందిస్తున్నారు. అలాగే హీట్ రెసిస్టెన్స్, డ్రాప్ రెసిస్టెన్స్ వంటి రక్షణ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
IR బ్లాస్టర్:
టీజర్లో కనిపించిన “Point and Tap Control Connectivity” ఫీచర్‌ను బట్టి ఈ ఫోన్లో IR బ్లాస్టర్ ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో టీవీ, ఎయిర్ కండీషనర్ వంటి IR సపోర్ట్ ఉన్న గృహోపకరణాలను నేరుగా ఫోన్‌తో నియంత్రించవచ్చు. అలాగే వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. అయితే కెమెరా సెన్సార్ల పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Also Read
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్‌లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
- Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
- Flosenso Pro: ఇక ట్యాంక్ చూడాల్సిన పనిలేదు.. మొబైల్లోనే వాటర్ ట్యాంక్ లెవల్, మోటార్ ను కంట్రోల్ చేసే గాడ్జెట్
Itel Zeno 100 Lite:
ఐటెల్ జెనో 100 లైట్ కోసం విడుదల చేసిన మైక్రోసైట్లో కొన్ని స్పెసిఫికేషన్లు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ ఫోన్లో 6.6 అంగుళాల HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, DTS సపోర్ట్‌తో స్పీకర్లు, MIL-STD మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. “Lite” అనే పేరును బట్టి చూస్తే.. ఈ మోడల్ Zeno 100 Pro కంటే తక్కువ ధరలో వచ్చే వేరియంట్‌గా ఉండే అవకాశం ఉంది. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే జూలై 16న Zeno 100 Proతో పాటు ఈ ఫోన్‌ను కూడా లాంచ్ అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అమెజాన్‌లో అందుబాటులో ఉన్న అధికారిక మైక్రోసైట్ ప్రకారం Itel Zeno 100 Pro భారత మార్కెట్లో జూలై 16న లాంచ్ కానుంది. రోజువారీ వినియోగంలో కఠిన పరిస్థితులను కూడా తట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్ల ధరలు, ప్రాసెసర్, కెమెరా వివరాలు, సాఫ్ట్వేర్ ఫీచర్లపై అధికారిక సమాచారం లేదు. లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ కంపెనీ మరిన్ని వివరాలను వెల్లడించనుంది.
తాజావార్తలు
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!