iQOO Z11 Turbo: వివో సబ్ బ్రాండ్ iQOO తాజాగా విడుదల చేసిన iQOO Z10 టర్బో స్మార్ట్‌ఫోన్ కి కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్సెట్, భారీ 7,620mAh బ్యాటరీతో వచ్చిన ఈ మోడల్‌కు కొనసాగింపుగా ఇప్పుడు iQOO Z11 టర్బోను తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ అవుతుంది. అయితే, ఇంకా అధికారిక లాంచ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. కానీ, తాజాగా విడుదలైన వీబో టీజర్‌తో ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక డిజైన్ వివరాలు మాత్రం బయటకు వచ్చాయి.
Read Also: Chhattisgarh: రాయ్‌గఢ్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
డిజైన్ వివరాలు
వీబోలో “Battle Sprite” అనే ట్యాగ్‌లైన్‌తో సంస్థ ఎగ్జిక్యూటివ్ షేర్ చేసిన టీజర్లో iQOO Z11 టర్బో బ్లూ కలర్ ఫినిష్‌లో కనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగం స్వల్పంగా క్రాస్ ఎడ్జ్‌లతో ఉండగా, కిందిభాగంలో iQOO బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ హ్యాండ్సెట్ మెటల్ ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Read Also: Shobhita pregnancy : చైతన్య తండ్రి కాబోతున్నాడన్న ప్రచారంపై నాగార్జున క్లారిటీ..!
లీక్ అయిన స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే,.. iQOO Z11 టర్బోలో 6.59 అంగుళాల 1.5K రిజల్యూషన్ డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. ఈ ఫోన్లో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ అందించే ఛాన్స్ ఉంది. అదనంగా 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్.. 7,600mAh కంటే ఎక్కువ సామర్థ్యమైన భారీ బ్యాటరీతో పాటు IP69 + IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఇందులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
iQOO Z10 టర్బో స్పెసిఫికేషన్లు
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న iQOO Z10 టర్బోను కంపెనీ చైనా మార్కెట్లో CNY 1,799 ప్రారంభ ధరతో (సుమారు రూ.21,100) విడుదల చేసింది. ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 8400 SoC, గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్, కెమెరా విభాగంలో 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ తో పాటు ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే, 90W ఫాస్ట్ చార్జింగ్‌తో కూడిన 7,620mAh బ్యాటరీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP65 రేటింగ్‌ను అందిస్తుంది.
Z సిరీస్‌లో కొత్త ప్రమాణాలు?
ఈ నేపథ్యంలో iQOO Z11 టర్బో మరింత శక్తివంతమైన ప్రాసెసర్. అధునాతన ఫీచర్లతో Z సిరీస్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక లాంచ్ తేదీపై ప్రకటన కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.