ఇండియన్ వెర్షన్ కంటే బెస్ట్ అప్‌గ్రేడ్ ఫీచర్లతో అక్కడ iQOO Z10R 5G లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z10R 5G: వివో సబ్ బ్రాండ్ అయిన iQOO తాజాగా తన iQOO Z10R 5G స్మార్ట్‌ఫోన్‌ను రష్యాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్ ఇప్పటికే భారత మార్కెట్‌లో విడుదలైన iQOO Z10R 5Gతో పోలిస్తే డిజైన్, చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యం, స్టోరేజ్ వేరియంట్ల పరంగా కొంత భిన్నంగా ఉంది. అయితే, రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15పై నడుస్తాయి. వీటిలో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
రష్యాలో iQOO Z10R 5G ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ RUB 22,999 (రూ.26,000) నుండి ప్రారంభమవుతుంది. ఇక 12GB + 512GB మోడల్ ధర RUB 27,999 (రూ.31,000)గా నిర్ణయించారు. ఈ ఫోన్ అక్టోబర్ 6న లాంచ్ కాగా.. ప్రస్తుతం డీప్ బ్లాక్, టైటానియం షైన్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. రష్యాలో యాండెక్స్ వంటి ఆన్‌లైన్ స్టోర్లలో కూడా ఇది కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్‌లో iQOO Z10R 5G జూలై 24న లాంచ్ అయింది. ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,499 కాగా, 8GB + 256GB వేరియంట్ రూ.21,499 , 12GB + 256GB వేరియంట్ రూ.23,499 ఉంది. భారతీయ వినియోగదారులకు ఇది ఆక్వా మెరైన్, మూన్ స్టోన్ కలర్లలో అందుబాటులో ఉంది.
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
రష్యా వెర్షన్‌లో ఉన్న iQOO Z10R 5Gలో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే (1080×2392 పిక్సెల్స్), 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. భారత మోడల్‌లో ఇదే డిస్‌ప్లే ఉన్నప్పటికీ, దాని పీక్ బ్రైట్‌నెస్ 1,800 నిట్స్ వరకు చేరుతుంది. రష్యా వెర్షన్‌ను 4nm MediaTek Dimensity 7360-Turbo చిప్‌సెట్ ఉండగా, భారత మోడల్ Dimensity 7400 SoCతో వస్తుంది. రష్యా వెర్షన్‌లో గరిష్టంగా 12GB LPDDR4X ర్యామ్ 512GB UFS 3.1 స్టోరేజ్ లభిస్తుంది.
కెమెరా విషయంలో రెండు ఫోన్లలోనూ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. అయితే రష్యా వెర్షన్‌లో 8MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉండగా, భారత మోడల్‌లో 2MP బోకె సెన్సార్ మాత్రమే ఉంది. ఫ్రంట్‌లో రెండు మోడళ్లలోనూ 32MP సెల్ఫీ కెమెరా సమానంగా ఉంది. రష్యా వెర్షన్ IP65 రేటింగ్ కలిగి ఉండగా, భారత మోడల్ IP68, IP69 రేటింగ్స్‌తో మరింత మెరుగైన డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ అందిస్తుంది. రష్యా వెర్షన్‌లో 6,500mAh బ్యాటరీ ఉండి, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. భారత వెర్షన్ మాత్రం 44W ఛార్జింగ్ ను మాత్రమే అందిస్తుంది. కొత్త మోడల్ 163.76×28×7.59mm కొలతలతో ఉండి, సుమారు 194 గ్రాములు బరువు ఉంటుంది.
తాజావార్తలు
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!