Snapdragon 8 Elite Gen 5 చిప్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 7000mAh భారీ బ్యాటరీతో రాబోతున్న iQOO 15..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO 15: iQOO సంస్థ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 15ను చైనా మార్కెట్లో కొద్ది రోజుల్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 SoC చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది Xiaomi 17 సిరీస్ తర్వాత ఈ ప్రాసెసర్‌ను పొందిన రెండవ ఫోన్‌గా నిలుస్తుంది. తాజా లీక్‌ల ప్రకారం, iQOO 15 భారతీయ మార్కెట్‌లో నవంబర్ మధ్య లేదా చివరలో విడుదల కానుందని సమాచారం. భారత మార్కెట్లో ఈ ఫోన్ Realme GT 8 Pro తర్వాత Snapdragon 8 Elite Gen 5 చిప్‌తో వచ్చే రెండవ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. iQOO 15 చైనా లాంచ్ అక్టోబర్ 20న జరగనుంది. భారత మార్కెట్లో దీని ధర దాదాపు రూ.60,000 లోపుగా ఉండవచ్చని అంచనా.
50MP+50MP కెమెరా సెటప్, 120Hz రిఫ్రెష్ రేట్ తో లాంచ్ కు సిద్దమైన Motorola Edge 70..!
Also Read
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
- OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!
iQOO 15లో 6.85 ఇంచుల 2K ఫ్లాట్ LTPO AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది గేమింగ్, మల్టీమీడియా అనుభవానికి మరింత స్మూత్ విజువల్స్‌ను ఇస్తుంది. ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో పాటు Q3 గేమింగ్ చిప్ ను కూడా ఉపయోగించారు. ఇది గ్రాఫిక్స్, రియల్ టైమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. మెమరీ, స్టోరేజ్ కోసం LPDDR5X ర్యామ్, UFS 4.1 టెక్నాలజీను వినియోగించారు.
ఈ రాబోయే ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా (1/1.56″ సెన్సార్, OISతో), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇందులో 7000mAh భారీ బ్యాటరీ వస్తుండగా.. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
Jubilee Hills By Election: నేడే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్..
సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను అందించారు. ఇది IP68+IP69 రేటింగ్ తో వస్తుంది. అంటే ఇది నీరు, ధూళికి నిరోధకంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ పరంగా iQOO 15 Android 16పై OriginOS 6తో నడుస్తుంది. అలాగే ఫోన్‌లో కస్టమైజ్ చేయగల RGB లైటింగ్ కూడా ఉంది. ఇది ఫోన్‌కు ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తుంది.
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!