అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18e: ఆపిల్ బ్రాండ్ ఫోన్ చేతిలో ఉండాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ లక్షల్లో పలికే ధరలను చూసి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి బడ్జెట్ యూజర్లకు, ఆపిల్ లవర్స్‌కు టెక్ దిగ్గజం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఇటీవలే అత్యంత ఖరీదైన ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు ఐఫోన్ డుయో మోడళ్లను మార్కెట్లోకి తెచ్చిన ఆపిల్.. వచ్చే ఏడాది ఆరంభంలో సామాన్యులను ఆకట్టుకునేలా సరికొత్త లైనప్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ ‘ఐఫోన్ 18e’. తాజా నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది ప్రారంభంలో స్టాండర్డ్ ఐఫోన్ 18, ఐఫోన్ ఎయిర్ 2లతో పాటు ‘ఐఫోన్ 18e’ అధికారికంగా లాంచ్ కానుంది. ఈ మొత్తం లైనప్‌లోనే అత్యంత చవకైన మోడల్‌గా ఐఫోన్ 18e మార్కెట్లోకి రాబోతోంది. లక్షలు పోసి ప్రో మోడల్స్ కొనలేని వారికి, తక్కువ బడ్జెట్లో లేటెస్ట్ ఐఫోన్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. కంపెనీ ఇంకా అధికారిక ధరను ప్రకటించనప్పటికీ, భారత మార్కెట్లో పోటీని తట్టుకునేలా దీన్ని అందుబాటు ధరలోనే తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ధర తక్కువగా ఉన్నప్పటికీ, రోజువారీ యూజ్‌కి అవసరమైన ప్రీమియం ఫీచర్లను ఇందులో అందించేలా ఆపిల్ ప్లాన్ చేస్తోంది. తాజా ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్, ఆపిల్ సొంత చిప్సెట్ పవర్, నాణ్యమైన కెమెరా పనితీరు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రీమియం లుక్‌తో పాటు ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి సులభంగా ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి ఈ మోడల్ ప్రధాన ఎంపిక కానుంది. ఓవైపు రూ.99,990 అంచనా ధరతో, 256GB బేస్ వేరియంట్, 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, పవర్ ఫుల్ 2nm A20 చిప్సెట్, పెద్ద బ్యాటరీతో ఐఫోన్ 18 రాబోతుండగా.. మరోవైపు అల్ట్రా స్లిమ్ లుక్‌లో ఐఫోన్ ఎయిర్ 2 కూడా సిద్ధమవుతోంది. వీటన్నింటి మధ్య అత్యంత తక్కువ ధరకే వచ్చే ‘ఐఫోన్ 18e’ మిడ్-రేంజ్, అప్పర్ మిడ్-రేంజ్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ బడ్జెట్ ఐఫోన్ లాంచ్ కానుండటంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Vivo Y6k: వివో Y6k 5G స్మార్ట్‌ఫోన్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP65 రేటింగ్‌తో లాంచ్!
- Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
- Caviar Zodiac iPhone Duo: రూ.14.65 లక్షల నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. మీ రాశి ప్రకారం కస్టమైజ్ చేసుకునే అవకాశం!
- 5G Smartphones: పండక్కి మొబైల్ కొంటున్నారా? రూ. 20 వేల లోపే టాప్ 5 బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
తాజావార్తలు
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
-
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
-
Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
-
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!