Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ సంతోషాలను, వెలుగులను , ఆత్మీయుల సాన్నిహిత్యాన్ని మోసుకొస్తుంది. అయితే చాలామంది ఉద్యోగాలు, చదువుల వల్ల ఇళ్లకు దూరంగా ఉంటూ ఈ పండుగను జరుపుకుంటారు. అలాంటి వారి కోసం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. అమెరికాలో కుటుంబానికి దూరంగా తాను జరుపుకున్న రెండు దీపావళి పండుగల జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.
విదేశాల్లో ఉన్నప్పుడు కుటుంబానికి దూరంగా పండుగ చేసుకోవడం ఎంత బాధాకరంగా ఉంటుందో తనకు తెలుసని ఆయన అన్నారు. ఇళ్లకు దూరంగా ఉన్నవారందరికీ తన ప్రేమను అందిస్తూ, రాబోయే తదుపరి దీపావళిని వారంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Also Read
ఈ శుభాకాంక్షల్లో భాగంగా ఆయన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు, పోలీసులు, వైద్య సిబ్బంది, ఎయిర్‌లైన్స్, రైల్వే, రోడ్డు రవాణా ఉద్యోగులు, అగ్నిమాపక సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, పనుల కోసం వచ్చిన వలస కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజం కోసం పండుగ రోజున కూడా తమ ఇళ్లకు దూరంగా విధులు నిర్వర్తిస్తున్న వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేశారు.
Having spent two Diwalis away from home while I was abroad, I know how much you miss your family and loved ones, especially during festivals.
So, a little extra love to everyone spending this Diwali away from home. I hope you get to celebrate the next one with your loved ones. ❤️🪔
— Abhijeet Dipke (@abhijeet_dipke) November 8, 2026
అభిజీత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. విదేశాల్లో సుదీర్ఘకాలం గడిపిన అనుభవం ఉండటంతో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా, పండుగ వేళ ఇంటికి దూరంగా ఉండే వారి బాధను మానవీయ కోణంలో అర్థం చేసుకుంటూ ఈ సందేశాన్ని ఇచ్చారు. కాగా, శనివారం నాడు ఆయన కేరళలోని కొచ్చిలో ఓ భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్ని అడ్డంకులు, దాడులు ఎదురైనా దేశవ్యాప్తంగా జాతీయ జెండాతో తన యాత్రను కొనసాగిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
-
Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..
-
Ind Vs Pak: అండర్-19 ఆసియా కప్ 2026.. భారత్‌పై పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ..
-
Fire Accident: సీతాఫల్మండిలో టపాసుల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
-
Maryam Nawaz: సీఎం వస్తున్నారని పరీక్షలాపేస్తారా? పాక్ సర్కార్ తీరుపై భగ్గుమన్న తల్లిదండ్రులు!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!