ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‍స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ‘డైనమిక్ ప్రొఫైల్ ఫోటో’ సదుపాయాన్ని లాంచ్ చేసింది. దీని ద్వారా యూజర్లు ప్రొఫైల్ ఫోటోలో.. ఫోటోతో పాటు అవతార్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంతకాలం ప్రొఫైల్ ఫోటోగా ఫోటో లేదా అవతార్ ఒకదాన్నే సెట్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఈ డైనమిక్ ప్రొఫైల్ ఫోటో ద్వారా ఫోటో, అవతార్ రెండు ఫ్లిప్ అవుతూ ప్రొఫైల్ ఫోటోలా కనిపిస్తాయి. కొత్త ఫీచర్‌ను ట్విట్టర్ ఖాతా ద్వారా ఇన్‍స్టాగ్రామ్ ప్రకటించింది. “మీ పిక్చర్‌కు ఇంకో సైడ్ ఇప్పుడు మీరు అవతార్‌ను యాడ్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్‍ను విజిట్ చేసే యూజర్లు ఫోటో, అవతార్ రెండింటినీ ఫ్లిప్ చేయవచ్చు” అని ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ చేసింది.
అవతార్‌ను ఎలా క్రియేట్, ఎడిట్ చేయాలి!
ముందుగా మీ స్మార్ట్ ఫోన్‍లో ఇన్‍స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ ప్రొఫైల్‍లోకి వెళ్లి.. ఎడిట్ ప్రొఫైల్‍పై క్లిక్ చేయండి. అక్కడ ప్రొఫైల్ పిక్చర్, అవతార్ రెండూ పక్కపక్కనే కనిపిస్తాయి. అవతార్‌పై ట్యాప్ చేసి.. మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అవతార్ స్కిన్ టోన్, హెయిర్ స్టైల్, ఔట్‍ఫిట్‍తో పాటు మరిన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అవతార్‌ను క్రియేట్ చేయడం పూర్తయ్యాక డన్‍పై ట్యాప్ చేసి సేవ్ చేంజెస్ ఆప్షన్‍ను ఎంపిక చేసుకోవాలి. అంతే అవతార్ క్రియేట్ అవుతుంది. ఈ ఇన్‍స్టాగ్రామ్ డైనమిక్ ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేసుకున్నాక.. ఎవరైనా యూజర్ మీ ప్రొఫైల్‍లోకి వచ్చినప్పుడు ప్రొఫైల్ ఫోటోపై స్వైప్ చేసి అవతార్‌ను కూడా చూసే అవకాశం ఉంది. ఒకేవేళ ఇంతకు ముందు మీరు ఫేస్‍బుక్‍లో అవతార్‌ను క్రియేట్ చేసుకుని ఉన్నా.. దాన్ని కూడా ఇన్‍స్టాగ్రామ్ కోసం ఉపయోగించుకోవచ్చు. కాగా, ఇన్‍స్టాగ్రామ్ అతి వినియోగాన్ని, యూజర్ల స్క్రీన్ టైమ్‍ను తగ్గించేందుకు ఇటీవల ఇన్ క్వైట్ మోడ్‍ను కూడా తీసుకొచ్చింది.
New profile pic, who this?
Now you can add your avatar to the other side of your pic — and people who visit your profile can flip between the two 🪙 pic.twitter.com/hEyzW4G19W
— Instagram (@instagram) January 24, 2023