అల్ట్రా-స్లిమ్ డిజైన్, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6,500mAh బ్యాటరీభారత్‌కు రానున్న Infinix Note Edge..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Note Edge: ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ (Note) సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ టిప్‌స్టర్ నుండి Infinix Note Edge పేరుతో పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదుగానీ.. కొన్ని కీలక ఫీచర్లు మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి. ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఒక అల్ట్రా-స్లిమ్ ఫామ్ ఫ్యాక్టర్ తో రానుందని సమాచారం. డిజైన్ పరంగా ఇది మోటోరోలా ఎడ్జ్ 70 తరహాలో ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
- Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు
- Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్‌ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
- WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్‌నేమ్.. పూర్తి వివరాలు
ఫోన్ వెనుక భాగంలో టాప్ వైపు పెద్దగా ఉన్న కెమెరా మాడ్యూల్ కనిపిస్తోంది. ఇందులో రెండు కెమెరా లెన్స్‌లు, LED ఫ్లాష్, అదనపు ఫిల్లర్ లైట్ ఉండే అవకాశం ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్ ను అందిస్తుందని టిప్‌స్టర్ వెల్లడించారు. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ ఫోన్ లో MediaTek Dimensity 7100 SoC ఉండే అవకాశం ఉంది. ఈ చిప్సెట్ 6nm ప్రాసెస్ టెక్నాలజీపై ఆధారపడి తయారవుతుందని సమాచారం. ఇది మిడ్-రేంజ్ సెగ్మెంట్లో మంచి పనితీరును అందించగలదని అంచనా.
అదిరిపోయే ఫీచర్స్ తో కేవలం రూ.12,499లకే Foxsky 43 అంగుళాల Full HD Smart LED TV.. ఎక్కడ కొనాలంటే..?
ఈ ఫోన్లో భారీగా 6,500mAh బ్యాటరీ ఇవ్వనున్నారు. సాఫ్ట్వేర్ పరంగా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ ఆండ్రాయిడ్ 16తో బాక్స్ నుంచే రానుంది. అలాగే, కంపెనీ 3 సంవత్సరాల OS అప్డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు అందించే అవకాశం ఉందని సమాచారం. ఈ మొబైల్ భారత్‌లో 2026 జనవరిలో లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. టీజర్ పోస్టర్లో ఫోన్ గ్రీన్ కలర్ వేరియంట్లో కనిపించింది. ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20,000లోపే ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Exclusive: This is Upcoming Infinix Note Edge launching soon!!
– DM 7100 5G (6nm)
– 3D Curved 1.5k Amoled Display
– 6500 mAh
– 3 Years of OS, 5 Years of Security updatesJanuary 2026!! #Infinix #NoteEdge pic.twitter.com/jCr4MTd83B
— Paras Guglani (@passionategeekz) December 27, 2025
తాజావార్తలు
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి.. ఎక్కడంటే..
-
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
-
2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
-
CM Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
-
Zim vs Ban: ‘ఇన్నోసెంట్ కైయా’ సెంచరీ.. బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ తేడాతో జింబాబ్వే ఘన విజయం.!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!