NTV Telugu Site icon

Gaganyaan Mission: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్ తొలి వ్యోమగామి..ఎప్పుడంటే..?

Nasa

Nasa

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన గగన్‌యాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) ప్రయాణిస్తుందని ఆయన తెలియజేశారు. ఇది ఇస్రో(ISRO), నాసా (NASA), యాక్సియమ్ స్పేస్ (Axiom Space) అనే ప్రైవేట్ కంపెనీల మధ్య ఉమ్మడి మిషన్ అవుతుంది. ఈ మిషన్ కోసం ఆక్సియమ్ స్పేస్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మిషన్‌ను ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆగస్టు 2024లో ప్రారంభించవచ్చు.

READ MORE: Dog Meat Row: బెంగళూర్ హోటళ్లకు కుక్క మాంసం.. ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు..

ఆగస్ట్‌లో ‘గగన్యత్రి’ అంతరిక్ష యాత్ర..
నాసా, యాక్సియమ్ స్పేస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాల్గవ ప్రైవేట్ వ్యోమగామి మిషన్ కోసం ఆర్డర్‌పై సంతకం చేసినట్లు ఇస్రో అధికారి తెలిపారు. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆగస్ట్ 2024లోపు ప్రయోగించే అవకాశం ఉంది. ఇస్రో బోర్డు ఈ నలుగురు పైలట్లను ఎంపిక చేసింది. వీరంతా రష్యాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన ప్రాథమిక మాడ్యూల్స్‌పై శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం వీరంతా గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రోకు చెందిన ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. గగన్‌యాన్ శిక్షణా కార్యక్రమం మూడు సెమిస్టర్లలో రెండు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శిక్షణ కోసం అవసరమైన సిమ్యులేటర్‌లు, స్టాటిక్ మోకప్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయి. మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్‌లోని కొన్ని భాగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.. లోక్‌సభలో టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.