ఫోల్డబుల్ టెక్నాలజీలో కొత్త మైలురాయి.. కొత్త Huawei Mate XTs ట్రై-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!
- ట్రిపుల్ ఫోల్డబుల్, Tiangong డ్యూయల్-హింజ్ డిజైన్
- 5,600mAh బ్యాటరీ, 66W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్, 7.5W రివర్స్ వైర్‌లెస్.
- M-Pen 3 స్టైలస్ సపోర్ట్
- బ్లాక్, పర్పుల్, రెడ్, వైట్ రంగులలో లభ్యం
- టాప్ ఎండ్ మోడల్ 16GB + 1TB వేరియంట్ CNY 21,999 (రూ. 2,71,900).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Mate XTs: చైనా టెక్ దిగ్గజం హువావే (Huawei) తన కొత్త ట్రై-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Mate XTsను చైనాలో లాంచ్ చేసింది. మూడు విధాలుగా మడుచుకునే ఈ ఫోన్‌లో కిరిన్ 9020 చిప్‌సెట్ (Kirin 9020 chipset), 16GB RAM లాంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉన్నాయి. ఇది కొత్త HarmonyOS 5.1పై నడుస్తుంది. ఇక ఈ ఫోల్డబుల్ Mate XTsలో 5,600mAh బ్యాటరీ ఉంది. దీనికి 66W వైర్డ్, 50W వైర్‌లెస్, 7.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. మరోవైపు మొబైల్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వబడింది.
Trump: టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు.. కనిపించని ఎలాన్ మస్క్
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఇక డిస్ప్లే విషయం చూస్తే.. Mate XTsలో 6.4 అంగుళాల సింగిల్ మోడ్ డిస్ప్లే (2232×1008p), 7.9 అంగుళాల డ్యుయల్ మోడ్ స్క్రీన్ (2232×2048p), పూర్తిగా తెరిచినప్పుడు 10.2 అంగుళాల ట్రై-ఫోల్డబుల్ డిస్ప్లే (2232×3184p) లభిస్తుంది. ఇవన్నీ LTPO OLED ప్యానెల్స్, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1440Hz PWM డిమ్మింగ్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్‌తో వస్తాయి. ఇక మొబైల్ కెమెరా సెటప్ గమనించినట్లయితే.. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 40MP అల్ట్రా-వైడ్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో (5.5x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి. అన్ని కెమెరాలు RYYB పిక్సెల్ లేఅవుట్ తో ఉండి, తక్కువ వెలుతురులో మంచి ఫోటోగ్రఫీని అందిస్తాయి. వీటిలో ప్రైమరీ, పెరిస్కోప్ కెమెరాలకు OIS సపోర్ట్ ఉంది. ముందు భాగంలో 8MP అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా పొందుపరిచారు.

ఇక అదనపు ఫీచర్లను గమనించినట్లయితే.. ఈ మొబైల్ కు M-Pen 3 స్టైలస్ సపోర్ట్ ఉంది. ఇది రిమోట్ కంట్రోల్ లేదా లేజర్ పాయింటర్‌లా కూడా ఉపయోగపడుతుంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 6, NFC, Bluetooth 5.2, UWB, IR బ్లాస్టర్, శాటిలైట్ కమ్యూనికేషన్, USB Type-C పోర్ట్ వంటివి ఉన్నాయి. హువావే Mate XTs ఫోన్ బరువు సుమారు 298 గ్రాములు ఉండగా, మొబైల్ పూర్తిగా తెరిచినప్పుడు మందం కేవలం 3.6mm మాత్రమే ఉంటుంది.
Flight Cancelled: సమాచారం లేకుండా విమానం రద్దు.. సిబ్బందితో సినీ నటుడి వాగ్వాదం..

ఇక ధరల విషయానికి వస్తే.. చైనాలో ఈ ఫోన్ 16GB + 256GB వేరియంట్ CNY 17,999 (రూ. 2,22,300) నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 16GB + 512GB వేరియంట్ CNY 19,999 (రూ. 2,47,100), ఇక టాప్ ఎండ్ మోడల్ 16GB + 1TB వేరియంట్ CNY 21,999 (రూ. 2,71,900)గా నిర్ణయించారు. ఇది బ్లాక్, పర్పుల్, రెడ్, వైట్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మొబైల్ సెప్టెంబర్ 5 నుంచి హువావే ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయం మొదలు కానుంది.

తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!