6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!
- చైనాలో Honor Play 80 Pro లాంచ్..
- భారీ 7,000mAh బ్యాటరీ
- 6.8 అంగుళాల TFT LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- Qualcomm Snapdragon 6s Gen 3 5G ప్రాసెసర్
- 50MP రియర్ కెమెరా (f/1.8 అపెర్చర్), 5MP ఫ్రంట్ కెమెరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor Play 80 Pro Launched: ప్రముఖ టెక్ బ్రాండ్ హానర్ (Honor) తన ప్లే (Play) సిరీస్ లో భాగంగా భారీ బ్యాటరీ కలిగిన Honor Play 80 Pro స్మార్ట్ ఫోన్ ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ ను తీసుకవచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆకట్టుకుంటున్న ప్రధాన ఫీచర్ దీని 7,000mAh భారీ బ్యాటరీ. సాధారణ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ఇది చాలా పెద్దది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో రెండు నుండి మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
స్లిమ్ డిజైన్.. పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?
Also Read
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
హానర్ ప్లే 80 ప్రో ఫోన్ లో 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల వీడియోలు చూడటం లేదా గేమింగ్ ఆడటం చాలా స్మూత్ గా ఉంటుంది. దీని బ్రైట్నెస్ 850 నిట్స్ వరకు ఉంటుంది. ఇక మొబైల్ లో మెరుగైన పనితీరు కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6s జెన్ 3 5G చిప్సెట్ ను అమర్చారు.
ఈ కొత్త మొబైల్ 6GB, 8GB, 12GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది. అన్ని మోడల్స్ 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉన్నాయి. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాను ఇచ్చారు. ఇది f/1.8 అపెర్చర్ తో వస్తుంది. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలు తీయవచ్చు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఉంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 9 (MagicOS 9) పై రన్ అవుతుంది.
Raghav Chadha vs AAP: మోడీకి భయపడి సమోసాల ధరల గురించి మాట్లాడతావా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం దీనికి IP65 రేటింగ్ ఇచ్చారు. చైనా మార్కెట్లో హానర్ ప్లే 80 ప్రో 6GB + 256GB వేరియంట్ రూ. 22,000 (CNY 1,899) కాగా, 8GB + 256GB వేరియంట్ రూ. 24,000 (CNY 2,099),12GB + 256GB రూ. 26,500 (CNY 2,299)గా నిర్ణయించారు. ఇది అజూర్ స్కై (Azure Sky), బ్లాక్ ఫాంటమ్ నైట్ (Black Phantom Night), వైట్ మూన్లైట్ (White Moonlight) వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. త్వరలోనే ఇది ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!