Google Lens: టెక్నాలజీ మరింతగా అప్డేట్ అవుతోంది. ప్రతీది అరచేతిలో ఇమిడిపోతోంది. ఒక్క సెల్ ఫోన్ మానవ మనుగడనే మార్చేసింది. మానవ జీవితాన్ని మరింత సుఖవంతంగా తయారు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక్క క్లిక్ ద్వారానే మీ చర్మ సమస్యలను గుర్తించవచ్చు. గూగుల్ లెన్స్ ఈ ఫీచర్ని తీసుకువచ్చింది. మీ చర్మ పరిస్థితిని ఇట్టే గుర్తించేలా గూగుల్ లెన్స్ మరింత స్మార్ట్ గా మారింది. ఉదాహరణకు మన చర్మానికి ఒక సమస్య ఉంది, అయితే దాన్ని ఏమని పిలుస్తారో్ తెలియన సందర్భంలో దానికి సంబంధించిన ఒక్క ఫోటో తీస్తే చాలు, దాని పేరు, అసలు ఏం సమస్య అనేది ఇట్టే తెలియజేస్తుంది.
Read Also: Aadhipurush : ఆదిపురుష్ మూవీ టీం స్పెషల్ విషెస్ తెలియజేసిన గోపీచంద్…!!
శరీరంలో చర్మంపై ఏదైనా సమస్య ఏర్పడితే..దాన్ని ఫోటో తీసి గూగుల్ లెన్స్ తో స్కార్ చేస్తే, దానికి సంబంధించిన విజువల్స్ తో సమాచారం వస్తుంది. ఉదాహరణకు చర్మంపై దద్దర్లు, వాపు, వెంట్రుకలు రాలిపోవడం వంటి వాటి గురించి గూగుల్ లెన్స్ సాయంతో తెలుసుకోవచ్చు. అయితే ఇది కేవలం యూజర్లకు వివరాలు తెలుసుకునేందుకే పరిమితమని, వ్యాధి నిర్థారణగా పరిగణించకూడదని గూగుల్ తెలిపింది. ఇలాంటి సమస్యలు వస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచించింది.
గూగుల్ లెన్స్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత వ్యవస్థ తీసుకురావడం వల్ల ఇది మరింత స్మార్ట్ గా మారుతోందని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు తెలియన వస్తువులు, వివిధ అంశాలు, సైన్ బోర్డులు, బాషలను ట్రాన్స్‌లేట్ చేసేందుకు, పోటోలకు గూగుల్ లెన్స్ వాడే వాళ్లం. అయితే ఇప్పటి నుంచి చర్మ సమస్యలను కనిపెట్టడంలో కూడా గూగుల్ లెన్స్ సాయపడనుంది.