Google Photosకు AI అప్‌డేట్.. వాయిస్ కమాండ్లతో ఫోటో ఎడిటింగ్
- భారత్‌లోని వినియోగదారుల కోసం Google Photosలో కొత్త AI ఆధారిత ఫీచర్లు..
- ఈ ఫీచర్లతో ఫోటోలను సవరించడం మరింత సులభం, టెక్స్ట్ కమాండ్లతోనే ఎడిటింగ్..
- Gemini AI ఆధారిత ఇమేజ్ జనరేటర్ ‘Nano Banana’ను కూడా గూగుల్ ఫోటోస్ ఎడిటర్‌లోకి మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Photos: భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం Google Photosలో కొత్త AI ఆధారిత ఫీచర్లను గూగుల్ విడుదల చేసింది. ఈ ఫీచర్లతో ఫోటోలను సవరించడం మరింత సులభమైంది. సాధారణ టెక్స్ట్ కమాండ్లతోనే ఫోటో ఎడిటింగ్ చేయగలిగేలా గూగుల్ ఈ ఫీచర్లను రూపొందించింది. అంతేకాదు, Gemini AI ఆధారిత ఇమేజ్ జనరేటర్ ‘Nano Banana’ను కూడా గూగుల్ ఫోటోస్ ఎడిటర్‌లోకి తీసుకొచ్చింది. ప్రాంతీయ భాషల మద్దతుతో ఈ ఫీచర్లు అందుబాటులోకి రావడంతో.. ఇండియన్ కస్టమర్లకు మరింత సులభంగా ఉపయోగపడనున్నాయి.
Read Also: Medaram Jatara: వనమెల్లా జనమే.. గద్దెపైకి సారలమ్మ.. మేడారంలో అద్భుత దృశ్యం..
Also Read
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
‘Conversational Editing’ ఫీచర్:
* ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ఫోటోలో చేయాలనుకునే మార్పులను వాక్యాల రూపంలో టైప్ చేయవచ్చు.
ఉదాహరణకు
* బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయి
* గ్లేర్ తీసేయి
* కలర్స్ మరింత ఆకర్షణీయంగా చేయు వంటి కమాండ్లను టైప్ చేస్తే, గూగుల్ ఫోటోస్ సొంతంగానే ఆ మార్పులను చేస్తుంది. ఇందుకోసం ఫోటోను ఓపెన్ చేసి “Help me edit” ఆప్షన్‌ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది.
‘Personalised Edits’:
* ఇక, గ్రూప్ ఫోటోలలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ‘Personalised Edits’ ఫీచర్‌ను గూగుల్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వినియోగదారుల ప్రైవేట్ ఫేస్ గ్రూప్‌లలోని ఫోటోలను ఆధారంగా తీసుకుని, వ్యక్తిగతంగా సవరింపులు చేస్తుంది.
Read Also: 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 10,001mAh బ్యాటరీ, 50MPతో Realme P4 Power 5G నేడే లాంచ్
ఉదాహరణకు
* ఫలానా వ్యక్తి సన్‌గ్లాసెస్ తీసేయి
* ఫలానా వ్యక్తిని నవ్వేలా చేయి వంటి ఆదేశాలతో గ్రూప్ ఫోటోలను మరింత మెరుగ్గా మార్చుకోవచ్చు.
గూగుల్ ఫోటోస్ లో Nano Banana:
గూగుల్ యొక్క Gemini AI ఆధారిత ఇమేజ్ జనరేటర్ ‘Nano Banana’ ఇప్పుడు Google Photos ఎడిటర్‌లో అందుబాటులోకి వచ్చింది.
* వినియోగదారులు ఫోటోలను కొత్త స్టైల్స్‌లో మార్చడం,
* AI ఆధారిత టెంప్లేట్స్ ఉపయోగించడం
* ఫోటోలను రీస్టైల్ చేయడం వంటి పనులను సులభంగా చేయవచ్చు. మీకు కావలసిన స్టైల్‌ను వివరించితే, Nano Banana ఆ ఫోటోను అదే విధంగా మార్చుతుంది.
ఎవరికీ అందుబాటులో ఉంటాయి?:
* Android 8.0 లేదా అంతకంటే పై వెర్షన్,
* కనీసం 4GB RAM ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే హిందీ, తమిళం, మరాఠీ, తెలుగు, బెంగాలీ, గుజరాతీ వంటి భారతీయ భాషలకు మద్దతు ఇచ్చింది గూగుల్.
AI ఎడిటింగ్‌లో గూగుల్ దూకుడు:
* ఈ కొత్త AI ఫీచర్లు ఫోటో ఎడిటింగ్ అనుభవం లేని సాధారణ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఒకప్పుడు క్లిష్టంగా అనిపించిన ఫోటో ఎడిటింగ్ పనులు ఇప్పుడు సాధారణ మాటలతోనే చేయగలిగే స్థాయికి చేరుకున్నాయి. దీని ప్రభావంతో అడోబ్ ఫోటోషాప్ లాంటి ప్రొఫెషనల్ టూల్స్‌కు సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ గతేడాది నవంబర్‌లో “Ask Photos” AI టూల్‌ను భారత్ సహా 100 దేశాల్లో విడుదల చేసింది. వేగంగా ఫీచర్లు రిలీజ్ చేయడం, ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత్ గూగుల్‌కు కీలక మార్కెట్ అన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!