కొత్త ఫీచర్లను పరిచయం చేసిన Google Maps.. Gemini AI ఇంటెగ్రేషన్ తోపాటు మరెన్నో ఫీచర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Maps – Gemini AI: గూగుల్ మ్యాప్స్ (Google Maps) నావిగేషన్, లొకేషన్ ఆధారిత సేవలను మరింత మెరుగుపరచేందుకు గూగుల్ ఏఐ అసిస్టెంట్ జెమిని (Gemini)తో జత కట్టింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా వినియోగదారులు డ్రైవింగ్‌పై దృష్టి పెట్టినట్టుగానే హ్యాండ్స్-ఫ్రీగా మ్యాప్స్‌తో మాట్లాడగలరు. అంతేకాకుండా.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇప్పుడు డ్రైవర్లు వాయిస్ కమాండ్లతోనే నావిగేషన్, సెర్చ్, ETA పంచుకోవడం, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ లభ్యత సెర్చ్ చేయడం, క్యాలెండర్ ఈవెంట్లు జోడించడం వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు.
Also Read
- OnePlus N6: వన్‌ప్లస్ ఎన్6 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ తేదీన విడుదల, డిజైన్ వెల్లడి
- HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
- Floating AI Data Centres: నీటిలో తేలియాడే AI డేటా సెంటర్లు.. శామ్సంగ్ కొత్త ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!
కొత్తగా పొందుపరిచిన జెమిని ద్వారా ట్రాఫిక్ అంతరాయాలను కూడా వాయిస్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. అలాగే మ్యాప్స్ ఇప్పుడు ట్రాఫిక్ లైట్లు, స్టాప్ సైన్ లతో పాటు రూట్ వెంట ఉన్న రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, భవనాలు వంటి ల్యాండ్‌మార్క్‌లను కూడా చూపిస్తుంది. ఈ ఫీచర్ స్ట్రీట్ వ్యూ, 250 మిలియన్లకు పైగా ప్రదేశాల డేటాబేస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇక ప్రోయాక్టివ్ ట్రాఫిక్ హెచ్చరికల ఫీచర్ ద్వారా వినియోగదారులు నావిగేషన్ యాక్టివ్‌గా ఉంచకపోయినా కూడా రోడ్డు మూసివేతలు, ట్రాఫిక్ జామ్‌లు వంటి సమాచారాన్ని ముందుగా తెలుసుకోగలరు. ఇక గమ్యస్థానాన్ని చేరుకున్న తర్వాత లెన్స్ ద్వారా జెమినిని ఉపయోగించి చుట్టుపక్కల ప్రాంతాలను గుర్తించడం, ఆ ప్రాంతాల గురించి ప్రశ్నలు అడగడం వంటివి చేయవచ్చు. ఇది కేవలం నావిగేషన్‌తో ఆగిపోకుండా ఆ స్థలం యొక్క అనుభవాన్ని (Experience) కూడా మెరుగుపరుస్తుంది.
చరిత్ర సృష్టించిన Maruti Suzuki India.. దేశంలో 3 కోట్ల కార్ల అమ్మకాలు..!
తాజావార్తలు
-
TPCC Mahesh Goud: పవన్ కళ్యాణ్‌పై మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
-
Tollywood Focus: హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ?
-
Explainer: ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు డబుల్ షాక్.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ స్టోరీ లైన్ లీక్!
-
Israel : ఇరాన్ – అమెరికా ఒప్పందంలో ఇజ్రాయెల్ ‘నిప్పులు’.. గంటల వ్యవధిలోనే లెబనాన్ సరిహద్దుల్లో బాంబుల మోత!
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!