Maruti Suzuki India: భారత ఆటోమొబైల్ రంగంలో మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited). దేశీయ మార్కెట్లో మొత్తం 3 కోట్ల యూనిట్ల విక్రయాలను నమోదు చేసి ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ప్యాసింజర్ వాహన తయారీ సంస్థగా మారింది. 1983 డిసెంబర్ 14న మొదటి కారు మారుతి 800ను వినియోగదారులకు అందించిన 42 ఏళ్లలో కంపెనీ ఈ విజయాన్ని సాధించింది.
టీమిండియా అమ్మాయిలకు TATA బహుమతి.. ప్రతి ఒక్కరికి Tata Sierra కారు..!
మారుతి సుజుకి అమ్మకాల వృద్ధి ప్రతి దశలో పెరుగుతూ వచ్చింది. ఈ జర్నీలో భాగంగా మొదటి ఒక కోటి యూనిట్లు విక్రయించడానికి కంపెనీకి 28 సంవత్సరాల 2 నెలలు పట్టింది. ఆ తర్వాత రెండవ కోటి యూనిట్లు కేవలం 7 సంవత్సరాల 5 నెలల్లోనే పూర్తయాయి. ఇక మూడవ కోటి యూనిట్లను విక్రయించడానికి కేవలం 6 సంవత్సరాల 4 నెలలు మాత్రమే పట్టింది. దీన్ని బట్టి చూస్తే అమ్మకాల వేగం, మార్కెట్ దృఢత్వాన్ని మారుతి సుజుకి ఏ విధంగా అర్థం చేసుకుందో స్పష్టంగా అర్థమవుతుంది.
Snapdragon 6s Gen 4 ప్రాసెసర్, IP64 రేటింగ్, 7000mAh బ్యాటరీతో Moto g57 సిరీస్ లాంచ్..!
మారుతి సుజుకి తయారు చేసిన పలు మోడళ్లలో కొన్ని ప్రత్యేకంగా ప్రజాదరణ పొందాయి. ఇందులో అత్యధికంగా.. ఆల్టో (Alto) సిరీస్ 47 లక్షలకు పైగా కార్ల విక్రయాలతో అత్యంత విజయవంతమైన మోడల్‌గా నిలిచింది. ఆ తర్వాత వ్యాగన్ ఆర్ (Wagon R) 34 లక్షలకు పైగా యూనిట్లతో రెండవ స్థానంలో ఉండగా, స్విఫ్ట్ (Swift) 32 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలతో మూడవ స్థానంలో నిలిచింది. వీటితో పాటు బ్రెజ్జా (Brezza), ఫ్రాంక్స్ (Fronx) మోడళ్లు కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ప్రస్తుతం మారుతి సుజుకి భారత మార్కెట్లో 19 వాహన మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో 170కి పైగా వేరియంట్లు, వివిధ పవర్ ట్రెయిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.