Google Caelebrates 27 Years Since: ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్ తాజాగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీనిని 1998లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ స్థాపించారు. గూగుల్ ను మొదట బ్యాక్ రబ్ అని పిలిచేవారు. ఈ కంపెనీ ఒక సాధారణ సెర్చ్ ఇంజిన్ గా ప్రారంభమైందన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ సెర్చ్ ఇంజన్ నేడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. డిజిటల్ ప్రపంచంలో గూగుల్ రోజువారీ జీవితంలో ఒక భాగమైంది. గూగుల్ సెర్చ్, యూట్యూబ్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్, జిమెయిల్, మ్యాప్స్, తాజాగా గూగుల్ జెమిని AI అన్నీ మన జీవితాల్లో భాగమవుతున్నాయి.
READ MORE: Manchu Manoj : నా వల్లే ఎన్టీఆర్ కు గాయం అయింది.. మనోజ్ కామెంట్స్
గూగుల్ లోగో కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు చాలా కంపెనీల లోగోలను ఒకటి లేదా రెండు రంగులతో చూసి ఉండవచ్చు. కానీ గూగుల్ తన లోగోలో బహుళ రంగులను చేర్చి ఈ ట్రెండ్ సెట్ చేసింది. గూగుల్ లోగోలో ఎరుపు, నీలం, పసుపు ఉన్నాయి. మధ్యలోని L ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది గూగుల్ యొక్క ప్రత్యేకమైన విధానాన్ని ప్రదర్శిస్తోంది. అలాగే.. గూగుల్ పదానికి అర్థం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. గూగుల్ అనేది గణితంలో ఉపయోగించే పదం ‘గూగోల్’ (Googol) పై చేసిన ఒక తెలివైన పద ప్రయోగం. ‘గూగోల్’ అంటే 1 తర్వాత వంద సున్నాలు ఉన్న సంఖ్యను లేదా 10 పవర్ 100ను సూచించే గణిత పదం. ఈ ‘గూగోల్’ పదాన్ని గణిత శాస్త్రజ్ఞుడు ఎడ్వర్డ్ కాస్నర్ మేనల్లుడు మిల్టన్ సిరోట్టా సృష్టించారు. అందువల్ల, గూగుల్ పేరు ద్వారా తమ సెర్చ్ ఇంజిన్ అపారమైన సమాచారాన్ని చూపించాలనే సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ఆశయాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశించారు.
READ MORE: IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్.. ఆ ఇద్దరు భారత ఆటగాళ్లపై వేటు!
వాస్తవానికి.. గూగుల్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉద్భవించింది. నేడు ప్రపంచ శోధన మార్కెట్‌ను ఆధిపత్యం చేస్తున్న ఈ సెర్చ్ ఇంజిన్ ఇక్కడే.. ఒక గ్యారేజీలో అభివృద్ధి చెందింది. ఇద్దరు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ ప్రపంచాన్ని మార్చేస్తోంది. గూగుల్‌కు మొదట్లో ‘బ్యాక్‌రబ్’ (BackRub) అని పేరు పెట్టారు. ప్రస్తుం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాప్ $2.99 ట్రిలియన్లు. పస్తుతం AI అంశంపై గూగుల్ వేగంగా పని చేస్తోంది. OpenAI, Perplexity వంటి కంపెనీలు Google కి సవాలు విసురుతున్నప్పటికీ.. Google Gemini పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. కంపెనీ తన అనేక సేవల్లో AI ని అనుసంధానించింది.