నిత్యం మనిషి జీవితంలో యూట్యూబ్ ఓ ప్రధాన భాగమైపోయింది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ రోజులో గంట సేపైనా యూట్యూబ్ వాడకుండా, చూడకుండా ఎవరు ఉండలేరు. అంతగా మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది యూట్యూబ్. అయితే.. ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు యూట్యూబ్ లో అప్‌లోడ్ చేస్తుంటారు. తమ నైపుణ్యాలతో ఎంతోమంది యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్లుగా మారిపోయారు.
Read Also: Delhi: మరీ కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాధ రథయాత్ర
అయితే ఇందులో డబ్బులు సంపాదించాలంటే ముందుగా మానిటైజేషన్‌కు అర్హత సాధించాల్సిందే. ఇందుకోసం 1000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు, 4000 గంటల వీక్షణలు లేదంటే 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్ వ్యూస్ తప్పకుండా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు అవి అవసరం లేదు అని యూట్యూబ్ చెబుతుంది. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలను ప్రస్తుతం సరళీకరించింది. ఇప్పటి వరకు మానిటైజేషన్‌కు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించింది.
Read Also: Ashes 2023: రసవత్తరంగా యాషెస్ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్‌కు 7 వికెట్లు!
దీంతో చిన్న కంటెట్ క్రియేటర్లు సైతం మానిటైజేషన్ ను పొందే విధంగా రూల్స్ ను తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో తక్కువ సబ్ స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లు సైతం యూట్యూబ్ లో ఆదాయాన్ని పొందే ఛాన్స్ ఉంది. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే సరిపోతుంది అని తెలిపింది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్‌లోడ్ చేసి ఉండాలి.. అలాగే ఏడాదిలో మూడు వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి అని యూట్యూబ్ పేర్కొనింది.
Read Also: PM Modi US Visit: అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..
ఈ కనీస అర్హతలు సాధించిన వాళ్లు ఇకపై యూట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌కు అప్లయ్ చేసుకోవచ్చు అని పేర్కొంది. అయితే ఈ కొత్త మానటైజేషన్ నిబంధనల్ని యూట్యూబ్ అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో స్టార్ట్ చేసింది. అయితే.. త్వరలోనే మిగతా దేశాల్లోనూ అమలు చేస్తామని చెప్పుకొచ్చింది. భారత్‌లో ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో స్మాల్ క్రియేటర్లకు మేలు జరుగనుంది.
Read Also: KTR: నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని గడించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ లో కంటెంట్ సైతం మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. అటు సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ వంటి టిప్పింగ్ టూల్స్ తో పాటు ఛానెల్ మెంబర్ షిప్స్ వంటి సబ్ స్క్రిప్షన్ టూల్స్ ను సైతం పొందే అవకాశం ఉందని యూట్యూబ్ పేర్కొనింది.