AI Effect: ఏఐతో ఉద్యోగాలు కోల్పోయే 10 రంగాలు ఇవే.. జాబితా వెల్లడించిన ఆంత్రోపిక్..
- వైట్ కాలర్ ఉద్యోగాలపై AI ప్రభావం..
- ప్రమాదకరంగా ప్రోగ్రామింగ్, సేల్స్ రంగాలు..
- జాబితా వెల్లడించిన ఆంత్రోపిక్ కంపెనీ సీఈఓ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాల్లో దాదాపు సగం మందికి ముప్పు ఉండవచ్చు అని ఆంత్రోపిక్ (Anthropic) కంపెనీ సీఈఓ డారియో అమోదీ హెచ్చరించారు. దీనికి సంబంధించి వారి కంపెనీ తాజాగా ఒక జాబితాను విడుదల చేసింది. ఏయే ఉద్యోగాలపై AI ప్రభావం ఎక్కువగా ఉంటుందో వారు విశ్లేషించారు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. AI వల్ల ఉద్యోగాలు వెంటనే పోతాయని కాదు, పని చేసే విధానం మారుతుందని అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నుంచి మొదలుకుని, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ వంటి పనుల్లో AIను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఏ పనులైతే AI సులభంగా చేయగలదో.. ఆ ఉద్యోగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయని ఈ రిపోర్ట్ చెబుతోంది. ఇలా ముఖ్యంగా 10 ఉద్యోగాల్లో ఈ ఏఐ ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నారు.
Also Read
- Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
- Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
- POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
- Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే!
Also Read:హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ విడుదల.. జాబితాలో కొత్తగా భారత్ నుంచి 57 మంది కోటీశ్వరులు..
ఈ జాబితాలో మొదటి స్థానంలో కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఉన్నారు. వీరి పనిలో దాదాపు 74.5 శాతం పనులను AI చేయగలదని అంచనా. ఆ తర్వాత కస్టమర్ సర్వీస్ పనుల్లో 70.1 శాతం, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పనుల్లో 67.1 శాతం AI సులభంగా చేయగలదు. అలాగే.. మెడికల్ రికార్డ్ స్పెషలిస్టులు (66.7 శాతం), మార్కెట్ రీసెర్చ్ , మార్కెటింగ్ నిపుణులు (64.8 శాతం), సేల్స్ ఉద్యోగాలు (62.8 శాతం), ఫైనాన్షియల్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్టులు (57.2 శాతం) కూడా తమ విధుల్లో సగానికి పైగా పనులను AIకి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా.. సాఫ్ట్‌వేర్ క్వాలిటీ టెస్టర్లు (51.9 శాతం), ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టులు (48.6 శాతం) మరియు కంప్యూటర్ యూజర్ సపోర్ట్ స్పెషలిస్టులు (46.8 శాతం) కూడా ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.
Also Read:RBI కొత్త గైడ్‌లైన్స్.. డిజిటల్ ఫ్రాడ్‌కు 85% వరకు పరిహారం..!
ఈ జాబితాలోని ఉద్యోగాలు పూర్తిగా మాయమైపోతాయని కాదు, ఆ ఉద్యోగాల్లో చేసే పనుల్లో సగానికి పైగా పనులను AI చేయగలదు. అంటే.. భవిష్యత్తులో ఈ పనుల కోసం మనుషుల అవసరం తగ్గొచ్చు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం.. AI వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నట్లుగా ఎక్కడా స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ.. కొత్తగా ఉద్యోగాల్లోకి చేరే వారికి అవకాశాలు తగ్గడం లేదా కంపెనీలు రొటీన్ పనుల కోసం మనుషులకు బదులు AIని వాడటం మొదలుపెట్టాయి.
Also Read:Sanju Samson: సంజు శాంసన్ సూపర్ ఫామ్ వెనుక సీక్రెట్..! బయటపెట్టిన టీమిండియా మాజీ కోచ్
AI మనిషికి సాయం చేస్తుందా? లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తుందా? అనే దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే.. టెక్నాలజీ పెరుగుతోంది, దానితో పాటు పని విధానం కూడా మారుతోంది. కాబట్టి మనం కూడా కొత్త విషయాలను నేర్చుకుంటూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
Ind Vs Pak: పాకిస్తాన్‌పై టీమిండియా ఆధిపత్యం.. 17 మ్యాచ్‌ల్లో 14 సార్లు భారత్‌దే గెలుపు.. నేడు మరో సమరం..
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!