USB Chargers: అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు మరియు విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన USB ఛార్జింగ్ పాయింట్ల గురించి పలు సూచనలు తెలిపింది.
ఈ రోజుల్లో చేతిలో మొబైల్ లేని వ్యక్తి కనిపించడం అరుదు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆన్‌లైన్ తరగతుల నుంచి ఆఫీస్ మీటింగ్‌ల వరకు ఏదైనా మొబైల్‌లో చేయవచ్చు. అయితే మొబైల్ పనిచేయాలంటే బ్యాటరీని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది బయటకు వెళ్లినప్పుడు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని బయటకు వెళ్తుంటారు. తరచూ ప్రయాణికులు తమ మొబైల్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు మరియు విమానాశ్రయాల్లో ప్రత్యేక USB ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన USB ఛార్జింగ్ పాయింట్ల గురించి అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెచ్చరికలు జారీ చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో USB ఛార్జర్లతో తమ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయవద్దని FBI వినియోగదారులకు సూచించింది. ఈ యూఎస్ బీ కేబుల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లలోకి మాల్ వేర్ ప్రవేశపెడుతున్నారని చెబుతున్నారు. మాల్స్, ఎయిర్‌పోర్ట్‌లతో సహా ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే యూఎస్‌బీ ఛార్జింగ్ కేబుల్స్‌కు బదులుగా వినియోగదారులు తమ సొంత ఛార్జర్‌లలోని పవర్ ప్లగ్‌కి కనెక్ట్ చేసి మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎఫ్‌బీఐ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. జ్యూస్ జాకింగ్ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో యూఎస్‌బీ ఛార్జర్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టి వినియోగదారుల వ్యక్తిగత, బ్యాకింగ్ సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొంది. పబ్లిక్ ప్లేస్‌లలో Wi-Fi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయినప్పుడు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని కూడా సలహా ఇస్తుంది. ఆన్‌లైన్ ఖాతాల కోసం బలమైన పాస్‌వర్డ్‌ను సెటప్ చేయాలని సిఫార్సు చేయబడింది.