Smartphone Safety Tips : వేసవిలో మీ ఫోన్ బాగా వేడెక్కుతుందా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
- ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా వేడిని తట్టుకోలేవు
- ఎక్కువ వాడకం వల్ల సెల్‌ఫోన్లు వేడెక్కే అవకాశం
- రాష్ట్రంలో ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- సెల్ ఫోన్లకు మరింత చేటు చేస్తాయన్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా వేడిని తట్టుకోలేవు. ఎక్కువ వాడకం వల్ల సెల్‌ఫోన్లు వేడెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సెల్ ఫోన్లకు మరింత చేటు చేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో వీడియో కాల్ మాట్లాడొద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ కాల్ మాట్లాడొద్దని సూచిస్తున్నారు. బయట ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో.. బ్లూటూత్, లోకేషన్ సర్వీసెస్, జీపీఎస్ వంటి సర్వీసులను ఆఫ్ చేయాలని చెబుతున్నారు. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Balochistan: ‘‘దమ్ముంటే క్వెట్టా దాటి బయటకు రండి’’.. పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..
Also Read
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
మీ ఫోన్‌ను సూర్యకాంతిలో ఎక్కువగా వాడొద్దు. ఒకవేళ ఎండలో ఉంచితే మీ స్మార్ట్ ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ప్రస్తుత కాలంలో చాలా స్మార్ట్ ఫోన్లు గంటలోపే 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతున్నాయి. కొన్ని స్మార్ట్ ఫోన్లు కేవలం రెండు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ అవుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, దాని వల్ల ఫోన్ వేడెక్కిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ ఫోన్ కవర్‌ను తీసేయండి. వేసవికాలంలో ఆరుబయట లేదా వేడి గదుల్లో ఎక్కువసేపు వీడియో గేమ్‌లను ఆడితే స్మార్ట్ ఫోన్ వేడెక్కే ప్రమాదం ఉంది. మీరు కనుక ఏసీ రూమ్‌లో వీడియో గేమ్స్ ఆడుకోవడం వల్ల మీ ఫోన్ వేడెక్కదు.
READ MORE: Naga Chaitanya: చైతూ లుక్ అదిరింది బాసూ
చాలా మంది ఫోన్‌ను కారు డాష్ బోర్డులో ఉంచుతారు. కారును నావిగేట్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ వంటి యాప్స్‌ను వాడుతారు. అయితే వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి నావిగేషన్ యాప్స్ వాడడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. ఈ వేడిని తగ్గించడానికి డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ఫోన్ ను ఏసీ వెంట్ పక్కన ఉంచండి. మీరు బైక్‌లో వెళ్తుంటే బ్యాగ్ లేదా జేబులో ఫోన్‌ను ఉంచుకోండి. మీ ఫోన్‌ను అదే పనిగా మరీ ఎక్కువగా వాడకుండా, కాస్త పక్కనపెట్టండి. అలా చేయడం వల్ల ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. మీ ఫోన్‌తె వచ్చిన ఒర్జినల్ ఛార్జగ్‌తోనే ఛార్జింగ్ పెట్టండి. వేరే ఛార్జగ్‌తో మీ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టడం వల్ల అది వేడెక్కే ప్రమాదం ఉంది.
READ MORE: MLC Botsa Satyanarayana: ఆర్థికంగా ఏపీ.. పాకిస్తాన్ అయిపోతుంది.. బొత్స సంచలన వ్యాఖ్యలు
మీరు ఉపయోగించని యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేయడం మంచిది. నిరంతరం యాప్స్ ఆప్డేట్లు కోసం నోటిఫికేషన్లు పంపుతాయి. దీంతో ఫోన్ వేడెక్కిపోయే ప్రమాదం ఉంది. అందుకే నోటిఫికేషన్లను కూడా ఆఫ్ చేయండి. ఇలా చేయడం యాప్‌లు బ్యాక్ గ్రాండ్లో రన్ అవ్వవు. దీంతో ఫోన్ వేడెక్కే ప్రమాదం తగ్గుతుంది. మీ ఫోన్‌ను మూసేసిన కారులో ఉంచొద్దు. అలా చేయడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. కారు మూసేసిన తర్వాత దాని లోపలి భాగం వేడెక్కిపోతుంది.
తాజావార్తలు
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!