ChatGPT :త్వరలో అందుబాటులోకి ChatGPT ఆండ్రాయిడ్ యాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ChatGPT: ఈ పేరు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్ బోట్.. చాట్‌జీపీటీకి పాపులారిటీ పెరిగిపోయింది. ఈ యాప్ వాడకానికి నెటిజన్ల నుంచి పరిశోధకులు, ఐటీ నిపుణులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రతి ఒక్కరిలోనూ ఈ యాప్ పై ఆసక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ.. యూజర్ల కోసం ఆండ్రాయిడ్ వర్షన్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. వచ్చే వారంలో ఆండ్రాయిడ్ ఆధారిత చాట్‌జీపీటీ యాప్ ఆవిష్కరిస్తారని సమాచారం. గత మే నెలలో ఓఐఎస్ యూజర్లకు యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..
ఈ మేరకు యూజర్లు ముందస్తుగా యాప్ కోసం ‘ప్రీ-ఆర్డర్’ చేసుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్’లో ప్రత్యేకంగా పేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ఓపెన్ ఏఐ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.. ఈ యాప్ సిద్ధం కాగానే రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఇన్ స్టాల్ చేసుకోవచ్చునని తెలిసింది. వాటర్ మార్కింగ్ కంటెంట్ వంటి అంశాలపై పారదర్శకతతోపాటు సేఫ్టీ విస్త్రుతానికి ఓపెన్ ఏఐ చర్యలు చేపట్టింది. ఏఐ నుంచి తప్పుడు సమాచారం వస్తున్నదన్న ఆందోళనల నేపథ్యంలో యాప్ తయారీని పూర్తిగా చెక్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు తెలుస్తుంది..
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
ఇకపోతే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ఆవిష్కరణ ద్వారా మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్‌తో నేరుగా ఓపెన్ ఏఐ పోటీ పడుతుంది. ఓపెన్ ఏఐ జీపీటీ-4 టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. యూరోపియన్ యూనియన్, బ్రెజిల్‌లలో గూగుల్ తన బార్డ్ చాట్ బోట్ ఆవిష్కరించగా, ఆంట్రోపిక్ తన క్లాడ్-2 చాట్ బోట్ తీసుకొచ్చిన తర్వాత చాట్‌జీపీటీకి ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఓపెన్ ఏఐ తన చాట్‌జీపీటీపై ఆండ్రాయిడ్ యూజర్లకు యాప్ అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం. అయితే ఎప్పుడు ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్స్ కు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వెల్లడించలేదు.
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!