ChatGPT: ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘ChatGPT’. ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ రూపొందించిన ఈ చాట్‌బాట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగిఉంది. అయితే, తాజాగా ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సుమారు 25 లక్షల (2.5 మిలియన్ల) మంది వినియోగదారులు ChatGPTని బహిష్కరిస్తున్నట్లు సమాచారం.
Gold Rates: యుద్ధ సమయంలో మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఈ భారీ బహిష్కరణకు ప్రధాన కారణం ‘స్కార్లెట్ జోహన్సన్’ (Scarlett Johansson) అనే హాలీవుడ్ నటి గొంతును అనుమతి లేకుండా ఉపయోగించడమేనని తెలుస్తోంది. OpenAI ఇటీవల విడుదల చేసిన ‘GPT-4o’ మోడల్‌లో ‘Sky’ అనే వాయిస్ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ వాయిస్ వినడానికి సరిగ్గా స్కార్లెట్ జోహన్సన్ గొంతులాగే ఉండటంతో వివాదం మొదలైంది. తన గొంతును ఉపయోగించడానికి నిరాకరించినప్పటికీ, సంస్థ కావాలనే తన వాయిస్‌ను కాపీ చేసిందని ఆమె ఆరోపించారు.
ఈ వివాదం కేవలం ఒక నటి గొంతుకు సంబంధించింది మాత్రమే కాదు. AI యుగంలో నైతిక విలువలు (Ethics), వ్యక్తిగత గోప్యత (Privacy) గురించి పెద్ద చర్చకు దారితీసింది. అనుమతి లేకుండా ఒక వ్యక్తి గుర్తింపును లేదా గొంతును AI ద్వారా సృష్టించడం చట్టవిరుద్ధమని.. ఇంకా అన్యాయమని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి నిరసనగా ‘Boycott ChatGPT’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Superstar Krishna : కత్తిపోటు లేకుండా కృష్ణ గారి సినిమా మార్నింగ్ షో పడదు :శివాజీ
వివాదం ముదరడంతో OpenAI స్పందించింది. ‘Sky’ వాయిస్ స్కార్లెట్ జోహన్సన్ ది కాదని, అది మరొక ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్ గొంతు అని సంస్థ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ, ప్రజల ఆందోళనలను గౌరవిస్తూ ప్రస్తుతానికి ఆ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు (Pause) ప్రకటించింది. కానీ, ఈ లోపే లక్షలాది మంది వినియోగదారులు తమ సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేసుకోవడం లేదా యాప్‌ను వాడటం మానేయడం వంటి చర్యలు చేపట్టారు.