NTV Telugu Site icon

TikTok: అమెరికా ముందు మోకరిల్లిన చైనా కంపెనీ! మస్క్‌ చేతుల్లోకి టిక్‌టాక్‌?

Tiktok

Tiktok

భారత్ వంటి దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత అమెరికాలో కూడా టిక్‌టాక్ ‘(TikTok)పై వేటు పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో చైనా టిక్‌టాక్ భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తోంది. పలు అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. చైనా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కి టిక్ టాక్ ను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. యుఎస్‌లో నిషేధాన్ని నివారించడంలో టిక్‌టాక్ విఫలమైతే, దానిని మస్క్‌కు అప్పగించవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. దీనిని చైనా పరిశీలిస్తుందని పేర్కొంది. యూఎస్ జనాభాలో దాదాపు సగం మంది టిక్‌టాక్‌ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 170 మిలియన్ల మంది ప్రజలు దీనిని వాడుతున్నారు.

READ MORE: South Africa Gold Mine: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి..

టిక్‌టాక్ దాని మాతృ సంస్థ బైట్‌డాన్స్‌లో కొనసాగాలన్నదే చైనా అధికారుల మొదటి ప్రాధాన్యత అని నివేదికలు పేర్కొన్నారు. అయితే.. ఇది సాధ్యం కాకపోతే, వారు ఇతర మార్గాలను పరిశీలిస్తున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. దీని తర్వాత, టిక్‌టాక్‌పై నిషేధంపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. చైనాకు వ్యతిరేకంగా కఠిన వైఖరి అవలంబించడంపై ట్రంప్ పలు సందర్భాల్లో మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు తెలిపిన మస్క్.. అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. కాగా.. ఇప్పటికే టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌ (ByteDance) యూఎస్ సుప్రీం కోర్ట్‌లో టిక్‌టాక్ నిషేధాన్ని సవాలు చేసింది. అయితే దీనిపై ఆంక్షలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ చట్టసభ సభ్యులు ఈ యాప్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. యూఎస్ కాంగ్రెస్ మాత్రం గత సంవత్సరం నిషేధానికి అనుకూలంగా ఓటు వేసింది.

READ MORE: South Africa Gold Mine: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి..

Show comments