భారత్ వంటి దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొన్న తర్వాత అమెరికాలో కూడా టిక్‌టాక్ '(TikTok)పై వేటు పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో చైనా టిక్‌టాక్ భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తోంది. పలు అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. చైనా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కి టిక్ టాక్ ను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. యుఎస్‌లో నిషేధాన్ని నివారించడంలో టిక్‌టాక్ విఫలమైతే, దానిని మస్క్‌కు అప్పగించవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.