Samsung Galaxy Z Flip 6: స్మార్ట్ మొబైల్స్ నందు ఫ్లిప్ మొబైల్స్ వేరయా అన్నట్లుగా.. స్మార్ట్ ఫోన్స్ లో ఎన్ని కొత్త ఫీచర్లు వచ్చిన ఫ్లిప్ మొబైల్స్ కు ఉన్న క్రేజ్ వేరు. నిజానికి చాలామంది ఈ ఫ్లిప్ మొబైల్స్ ధర ఎక్కువగా ఉండడంతో వాటిని కొనడానికి ఇష్టపడరు. అయితే అలాంటి వారి కోసం తాజాగా శాంసంగ్.. గెలాక్సీ Z ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6) మొబైల్ పై భారీ ఆఫర్ తీసుకవచ్చింది. ఎవరైతే ఫ్లిప్ మొబైల్స్ కొనాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశం.
ప్రస్తుతం అమెజాన్ ఈ ప్రీమియం ఫ్లిప్ స్టైల్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.44,300 కంటే ఎక్కువ తగ్గింపు ఆఫర్ ను అందిస్తోంది. మొదటిసారి ఫ్లిప్ స్టైల్ ఫోన్ ఉపయోగించాలనుకునే వారికి లేదా మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ డీల్ సరిగ్గా సరిపోతుంది. అమెజాన్ లో ప్రస్తుతం Samsung Galaxy Z Flip 6 ధర రూ. 68,970గా ఉంది. అయితే, దీని అసలు ప్రారంభ ధర రూ. 1,09,999. అంటే ఈ ఫోన్‌పై ఏకంగా రూ.40,399 డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదండోయ్.. HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై మరో రూ. 4,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత ఫోన్‌ను ఇచ్చి మరింత కూడా ఆదా చేసుకోవచ్చు.
కొత్త ఫీచర్లను పరిచయం చేసిన Google Maps.. Gemini AI ఇంటెగ్రేషన్ తోపాటు మరెన్నో ఫీచర్లు..!

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. Galaxy Z Flip 6లో 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X ఇన్నర్ డిస్‌ప్లే ఉంది. బయట వైపున 3.4-అంగుళాల సూపర్ AMOLED కవర్ స్క్రీన్ ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విభాగంలో 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 10MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ ఫ్లిప్-స్టైల్ ఫోన్‌లో AI ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది “ఆటో జూమ్” ఫీచర్ ఫోటో తీస్తున్న విధానాన్ని విశ్లేషించి, ఫ్రేమింగ్‌ను సర్దుబాటు చేసి ఉత్తమ ఫోటోలను తీసేలా చేస్తుంది.