యాపిల్ కంపెనీ నిత్యం కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. గతేడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేశారు.. ఆ ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా సంతరించుకుంది.. ఇదిలా ఉండగా ప్రస్తుతం పండుగ సేల్స్ ముగిసినప్పటికీ ఆపిల్ ఐఫోన్ 14 ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పోలిస్తే.. అమెజాన్ లో భారీగా ధరలు తగ్గాయని తెలుస్తుంది..
ఐఫోన్ 14 అమెజాన్‌లో చౌకైన ధరకు లభిస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13 మాదిరిగా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కానీ, మరిన్ని కోర్ అప్‌డేట్స్‌తో ఐఫోన్ 14 గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో ప్లస్‌తో పాటు రూ. 79,900 ప్రారంభ ధరతో వచ్చింది. అదేవిధంగా ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 14 ఇటీవల రూ. 10వేల ధర తగ్గింది.. అమెజాన్‌లో మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 34,500 వరకు తగ్గింపును అందిస్తోంది. అన్ని ఆఫర్లు, తగ్గింపులతో అమెజాన్ నుంచి ఐఫోన్ 14ని కేవలం 27,499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14ని అన్ని ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో కలిపి రూ. 58,999కి కొనుగోలు చేయవచ్చు…
ఫీచర్స్ ను చూస్తే.. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 12ఎంపీ కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ 13-వంటి నాచ్‌తో ఫ్రంట్ సైడ్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్సడీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ ఈ ఐఫోన్ 12ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ సమయంలో డిస్కౌంట్ పొందిన తర్వాత ఐఫోన్ 14 కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది.. ఇంకా అద్భుతమైన ఫీచర్స్ ను కలిగి ఉంది..