Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Claude for Legal: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ‘ఆంత్రోపిక్’ సంస్థ కొత్త ఆవిష్కరణతో వచ్చింది. కోడింగ్ ప్రపంచం తర్వాత ఇప్పుడు న్యాయ వ్యవస్థపై దృష్టి సారించింది. తన క్లాడ్ (Claude) చాట్‌బాట్ ద్వారా లాయర్లు, లా ఫామ్స్ కోసం సరికొత్త ఏఐ టూల్స్‌ను ఆవిష్కరించింది. కేవలం మానవ నైపుణ్యంతోనే సాధ్యమని భావించే వృత్తిపరమైన రంగాల్లోకి సైతం ఏఐ ప్రవేశించింది. “క్లాడ్ ఫర్ లీగల్” (Claude for Legal) పేరుతో ఆంత్రోపిక్ తన సేవలను విస్తరిస్తూ, డాక్యుమెంట్ల రివ్యూ, లీగల్ రీసెర్చ్, కేసుల ప్రిపరేషన్, డిపోజిషన్ ప్లానింగ్, పేపర్ వర్క్ డ్రాఫ్టింగ్ వంటి పనులను ఆటోమేట్ చేసేలా కొత్త ప్లగిన్లను తీసుకొచ్చింది. కార్పొరేట్ చట్టం, ఉపాధి చట్టం, ప్రైవసీ, ఏఐ గవర్నెన్స్ వంటి విభాగాల్లో పనిచేసే న్యాయవాదులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా డాక్యుసైన్ (DocuSign), బాక్స్ (Box), థామ్సన్ రాయిటర్స్ వంటి లీగల్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్‌లతో క్లాడ్ నేరుగా అనుసంధానమయ్యేలా ప్రత్యేక కనెక్టర్లను రూపొందించారు.
ప్రస్తుతం న్యాయ రంగంలో ఆధునికీకరణ, పనితీరు మెరుగుపరచాలనే ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఈ అడుగు పడింది. ఇప్పటికే హార్వీ (Harvey), లెగోరా (Legora) వంటి ఇతర ఏఐ స్టార్టప్‌లు ఈ రంగంలో భారీ పెట్టుబడులతో పోటీ పడుతున్నాయి. క్లాడ్ సైతం ఇప్పుడు తన పెయిడ్ యూజర్ల కోసం ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. లీగల్ రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాలెడ్జ్ వర్క్ విభాగమని ఆంత్రోపిక్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అయితే, న్యాయస్థానాల్లో ఏఐ వాడకంపై కొన్ని ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొందరు లాయర్లు ఏఐ సృష్టించిన తప్పుడు సమాచారాన్ని, కల్పిత కోట్లను కోర్టుకు సమర్పించి విమర్శలు, జరిమానాలు ఎదుర్కొన్న ఘటనలు ఉన్నాయి. నాణ్యత లేని పిటిషన్లు, గందరగోళపరిచే లీగల్ ఆర్గ్యుమెంట్లతో కోర్టులపై భారం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఏఐ అందించే వేగాన్ని వాడుకుంటూనే, ఖచ్చితత్వం విషయంలో జాగ్రత్తగా ఉండటం న్యాయ నిపుణులకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..