WhatsApp stop working: వాట్సాప్ లేనిది ఏ స్మార్ట్ ఫోన్ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు.. చిన్నా, పెద్ద తేడా లేకుండా వాట్సాప్ వాడేస్తున్నారు.. చాటింగ్, వాయిస్ మెసేజ్‌లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. ఒక్కటేంటి.. ఫొటోలో, వీడియోలు, ఫైల్స్ ఇలా ఎన్నో సులువుగా షేర్ చేసుకునే అవకాశం ఉండడంతో.. తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందింది ఈ యాప్.. ఇక, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తూనే ఉంది.. ఇదంతా ఎందుకంటే.. వాట్సాప్ యూజర్లు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 1, 2023 నుండి వాట్సాప్ కొన్ని మోడల్స్ మొబైల్ ఫోన్లలో అసలు పనిచేయదు.. కాబట్టి మీరు కలిగి ఉన్న మోడల్ వాటిలో ఉందా? లేదా? అనే విషయాన్ని మీరే చెక్ చేసుకోండి.. ఆండ్రాయిడ్ 4.1, iOS 12 లేదా ఐఫోన్‌లు వెర్షన్ KaiOS 2.5.0తో పని చేసే మోడల్‌లు, 8 మరియు 10 సంవత్సరాల మధ్య పాత మోడల్‌లు, కానీ, ఈ మెసేజింగ్ యొక్క కొత్త వెర్షన్‌ను ఆపరేట్ చేయగల మోడల్‌లు సాధ్యం కాదని మెటా ప్రకటించింది.
Read Also: INDvsAUS Test Series: అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడట్లేదు..సీక్రెట్ బయటపెట్టిన స్మిత్
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వాట్సాప్ పనిచేయని మోడల్ ఫోన్స్ మీ కోసం..
* శామ్‌సంగ్ గెలాక్సీ కోర్
* శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
* శామ్‌సంగ్ గెలాక్సీ Ace 2
* శామ్‌సంగ్ గెలాక్సీ s3 Mini
* శామ్‌సంగ్ గెలాక్సీ Trend II
* శామ్‌సంగ్ గెలాక్సీ x కవర్ 2.
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 3
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 5
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్ 5
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 3
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 7
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 5 డ్యూయల్
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 7 డ్యూయల్
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్ 3
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్3క్యూ
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 2
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 4
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్6
* ఎల్‌జీ లూసిడ్ 2
* ఎల్‌జీ ఆప్టిమస్ ఎఫ్7
* Huawei Ascend Mate
* Huawei Ascend G740
* Huawei Ascend D2
* iphone 6s
* iphone 6s ప్లస్
* సోనీ ఎక్స్‌పీరియా ఎమ్
* Lenovo A820
* ZTE V956 – UMI X2
* ZTE గ్రాండ్ S ఫ్లెక్స్
* ZTE గ్రాండ్ మెమో
* ఫెయా F1THL W8
* వికో సింక్ ఫైవ్
* విన్కో డార్క్నైట్
* ఆర్కోస్ 53 ప్లాటినం