ఫిబ్రవరి 9న భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. టీమిండియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది కంగారూ జట్టు. అయితే, ప్రతి టెస్టు సిరీస్ ముందు ఆతిథ్య మైదానాల్లో వార్మప్ మ్యాచ్‌లు ఆడటం ఆనవాయితీ. కానీ ఈ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడట్లేదు. నేరుగా సిరీస్‌లో భారత్‌ను ఢీకొననుంది. పిచ్‌లలో వ్యత్యాసం ఉంటుందని భావించి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకూడదని ఆస్ట్రేలియా నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మద్దతు పలికాడు. వార్మప్ మ్యాచ్‌లు ఆడకపోవడమే బెటర్ అని చెప్పాడు.
Poliece Car Stolen: పోలీసుల కారునే దొంగలించాడు.. క్లైమాక్స్ మాత్రం సూపర్ బాసు
“ఇంతకుముందు ఇక్కడ మేము ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాం. అసలు ఆ మ్యాచ్‌ల్లో ఆడాల్సిన అవసరం లేదు. మేము మా నెట్ ప్రాక్టీస్‌లో వీలైనంత ఎక్కువగా స్పిన్నర్లను ఎదుర్కోవాలి. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా సరైన నిర్ణయం తీసుకున్నామని నేను భావిస్తున్నాను” అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. స్మిత్ కంటే ముందు ఆసీస్ మరో బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా కూడా ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.
Air India Urination Case: కో పాసింజర్‌పై మూత్ర విసర్జన కేసులో శంకర్ మిశ్రాకు బెయిల్
కాగా, ఈ సిరీస్‌కు ముందు టీమిండియా ప్లేయర్ల కోసం బీసీసీఐ ప్రాక్టీస్ సెషన్లను ఏర్పాటు చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు భారత్‌కు ఇదే చివరి సిరీస్ కావడం వల్ల ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తోన్న బీసీసీఐ.. టెస్టు సిరీస్‌కు ముందు నాగ్‌పూర్‌లో టీమ్‌ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్‌ను నిర్వహించనుంది. అయితే, తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చే విదర్భ క్రికెట్ అసోసియేసన్ (వీసీఏ) స్టేడియంలో రెండు సెషన్స్ మాత్రమే జరుగుతాయి. మిగతా మూడు సెషన్స్‌ని పాత వీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు. “సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు టెస్టు ఆటగాళ్లు నాగ్‌పూర్‌లో కలుస్తారు. అక్కడ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో వారికి క్యాంపు ఉంటుంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ద్రవిడ్ జట్టుతో కలుస్తాడు. ఇది ఫిట్‌నెస్ క్యాంప్. కానీ, టెస్టు సిరీస్ ఆడటానికి ముందు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేయడానికి ఇది మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది”అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.