లాల్దుహోమా నాయకత్వంలోని ZPM (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) మిజోరంలో విజయం సాధించింది. 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో అధికార MNF (మిజో నేషనల్ ఫ్రంట్)ను అధికారం నుండి తొలగించి.. జడ్పీఎం అధికారం చేపట్టనుంది. కాగా.. మిజోరాం నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి లాల్దుహోమ ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) ఘనవిజయం సాధించింది. ఈసారి అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం), కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అందరు భావించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 40 సీట్లున్న అసెంబ్లీలో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) 27 సీట్లను గెలుచుకుంది.
Mizoram Election Result: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అందరి దృష్టి ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంపై పడింది. సోమవారం (డిసెంబర్ 4) ఇక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
Election Results 2023 : భారత ఎన్నికల సంఘం మార్చిన షెడ్యూల్ ప్రకారం మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇక్కడ అధికార పార్టీలు మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), కాంగ్రెస్ ఉన్నాయి.
రేపు మిజోరంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ అధికారంలోని ఎంఎన్ఎఫ్, ప్రతిపక్షంలోని జెడ్‌పీఎం, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉన్నది. అయితే, రెండు స్థానిక పార్టీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ పోటీ చేసే 174 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 114 మంది (66 శాతం) కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్ట్ పేర్కొంది.