కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. ఉద్యోగుల బదిలీలు ఉన్నాయా? తెలంగాణ సాధించుకున్నామన్న సంతోషం ఆవిరై.. కొత్త సమస్యను తలెకెక్కించుకున్నామనే భావనలో ఉద్యోగులు ఉన్నారా? ఇంతకీ కొత్త జోనల్ విధానం ఉద్యోగులకు వరమా.. శాపమా..? ఉద్యోగులకు అన్యాయం జరగకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదా? తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఇదే అదునుగా కొందరు అధికారులు పారదర్శకతకు పాతరేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు…
తెలంగాణలో జోనల్ వ్యవస్థలో మార్పులకు ఈ ఏడాది ఏప్రిల్ 19న రాష్ట్రపతి ఆమోదం తెలియజేయగా.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది.. తద్వారా జోనల్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేసింది.. ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందున ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ కొత్త జోనల్ విధానం వర్తింపజేయనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలకు తోడు స్థానికులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం జోనల్ వ్యవస్థలో మార్పులుచేసింది.…