Zia Ur Rehman Barq: విద్యుత్ చౌర్యం కేసులో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్‌పై యూపీ విద్యుత్ శాఖ కేసు నమోదు చేశారు. నవంబర్ నెలలో సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో అధికారులపై దాడులు చేసిన ఘటనలో రెహ్మాన్ బార్క్ నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్, ఆ ప్రాంతంలోని ఆక్రమణలను తొలగిస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తులపై కేసులు పెడుతోంది.