అరుణ గ్రహం పై అడుగిడిన రెండో దేశం చైనా. తియాన్ వెన్ 1 అనే వ్యోమనౌకను గతేడాది చైనా ప్రయోగించింది. ఈ నౌక ఇటీవలే అరుణగ్రహంలోని ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఉపగ్రహంలో ఉన్న ఝురాంగ్ రోవర్ శనివారం రోజున ల్యాండర్ నుంచి కిందకు దిగింది. మార్స్ మీద అడుగుపెట్టిన ఆరు చక్రాలతో కూడిన రోవర్ ఫోటోను భూమి మీదకు పంపించి. హైరెజల్యూషన్ 3డి కెమెరాల సహాయంతో ఫోటోలను తీసింది. ఈ రోవర్ గంటకు 200 మీటర్ల మేర ప్రయాణం చేస్తున్నది. …