అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైట్‌హౌజ్‌లోని ఓవర్ ఆఫీస్ వేదికగా జరిగిన ఇరువురు నేతల భేటీలో వాగ్వాదం, అంతర్జాతీయ మీడియా ముందే జరిగింది. ఇద్దరు నేతలు ఒకరి మాటలకు మరొకరు అరుచుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్, అమెరికా మధ్య కీలకంగా భావిస్తున్న ‘‘ఖనిజ ఒప్పందం’’ జరగకుండానే జెలెన్స్కీ వెనుదిరిగారు. ఖనిజ ఒప్పందంతో పాటు రష్యా నుంచి తమ రక్షణకు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్…