jeevitha rajasekhar:తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకు తగ్గట్లుగా కేంద్ర మంత్రులు, కీలక నేతలు తరుచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. తాజాగా నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర కూడా పూర్తయింది. అయితే రానున్న రోజుల్లో మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి…