Yuzvendra Chahal Record in T20s: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చహల్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఔట్ చేసి.. టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయిని యూజీ అందుకున్నాడు. 301 మ్యాచ్‌లలో చాహల్ ఈ ఫీట్ సాధించాడు.…