తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని స్థాపించి సమస్యలపై పోరాటం చేస్తున్నారు ఆ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల… ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టారు… ప్రతీ మంగళవారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తూ వస్తున్నారు.. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా చెబుతున్న ఆమె.. రాజన్న యాదిలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఊరూరా వైయస్ఆర్ జెండా పండుగ నిర్వహించాలని నిర్ణయించారు.. ఆగస్టు 5వ తేదీ నుంచి జెండా పండుగ నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు వైఎస్…