ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ జిల్లా పోలీసులు నోటీసులు పంపడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వైసీసీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాల ముందు నిరసన చేపట్టాయి. అయితే ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కాగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు వైసీపీతో సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేత పట్టాభి ఇంటితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. రౌడీయిజం చేస్తే బెదురుతామని భావించవద్దు నఅ్నారు.. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇది నా కోసం చేసే పోరాటం కాదు.. వైసీపీ సృష్టించిన విధ్వంసానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాం.. ఆ బంద్‌కు సహకరించడం…
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి దాడులు మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ ఆఫీసులపై, నాయకుల ఇళ్లపై దాడులు మరిన్ని అరాచకాలకు దారితీస్తాయని పవన్ అన్నారు. వైసీపీ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన కోరారు. దాడులు చేసినవారిని తక్షణమే శిక్షించాలని ఏపీ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.…
ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు పలు చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నాయి. వైసీపీ దాడులకు నిరసనగా రేపు (అక్టోబర్ 20) ఏపీ వ్యాప్తంగా బంద్ చేయాలని ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం దారుణమని, ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తక్షణమే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాజకీయ…
డ్రగ్స్, గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా హీట్ పెంచాయి.. వివిధ పత్రికల్లో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. అందరికీ నోటీసులు ఇవ్వాలంటూ.. నోరు జారిన పట్టాభి.. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న దద్దమ్మకు చెబుతున్నా.. వరే బోసిడీకే నీకు దమ్ముంటే.. గంజాయిపై మాట్లాడిన తెలంగాణ పోలీసులకు, యూపీ పోలీసులకు, మీ అధికారులకు నోటీసులు ఇవ్వాలంటూ సవాల్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ శ్రేణులు.. పట్టాభి ఇంటిపై దాడికి దిగారు..…
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత పట్టాభి ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేయడం కలకలం సృష్టించింది… ఇదే సమయంలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి… మరికొన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది.. గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి.. వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్‌పై ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. గంజాయి విషయంలో టీడీపీ నేతలకు నోసులు ఇవ్వడంపై స్పందిస్తూ.. సీఎంను టార్గెట్ చేశారు…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి… అసలు దళితులు ఎవ్వరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… వైసీపీ దళిత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దళితుల గురించి అవహేళనగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని బద్వేల్ ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు… దళితులకు నాగరికత లేదని మాట్లాడే ఆదినారాయణరెడ్డికి అసలు దళితుల ఓట్లు అడిగే హక్కులేదన్న ఆయన.. దళితులు ఎవ్వరూ బీజేపీకి…
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. అయితే ఈ ర్యాలీ కాసేపటికే రసాభాసగా మారిపోయింది. ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై వైసీపీ మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసరడంతో కాసేపు…
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్‌పై విద్యుత్ సంక్షోభం విషయంలో సెటైర్లు వేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారని ఫై అయిన ఆయన.. ఫ్యాన్‌కి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.. ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడు.. మరోపక్క విద్యుత్ కోతలతో అంధకారం అని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని.. 40 రోజుల…