YSRCP Samajika Sadhikara Bus Yatra: మూడు ప్రాంతాల్లో ఏక కాలంలో మూడు బస్సు యాత్రలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Samajika Sadhikara Bus Yatra: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న సామాజిక సాధికార బస్సు యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాల్లో ఈ యాత్రలు ఏక కాలంలో చేపట్టనున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, గుంటూరు జిల్లా తెనాలి, అనంతపురం జిల్లా శింగనమల నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆయా సామాజిక వర్గాల కార్పొరేషన్ల కు సంబంధించిన ఛైర్మన్లు, డైరెక్టర్లు, నేతలు పాల్గొంటారు. ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి బస్సు యాత్ర షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం ఎంపిక చేసిన ప్రాంతంలో సుమారు 200 మంది పార్టీ నేతలు ఒకచోట సమావేశమై సామూహిక భోజనాలు చేస్తారు.
అనంతరం ముఖ్యనేతలు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి నిర్దేశించుకున్న రూట్ మ్యాప్‌లో బస్సు ప్రయాణం ప్రారంభం అవుతుంది. నిర్దేశించుకున్న పాయింట్లు, ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల దగ్గర స్థానిక ప్రజలతో నాయకులు మమేకం అవుతారు. తమ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అందించిన సంక్షేమ ప్రయోజనాలు, రాజకీయ సాధికారత, ఆయా వర్గాల్లో వచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ పురోగతిని వివరిస్తారు. సాయంత్రం బహిరంగ సభను నిర్వహిస్తారు. అంటే ప్రతిరోజూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో… మూడు బహిరంగ సభలను నిర్వహిస్తారు. సామాజిక బస్సు యాత్ర మూడు దశల్లో జరుగనుంది. గురువారం నుంచి ప్రారంభం అయ్యే ఫస్ట్ ఫేజ్ నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది.
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ఇందులో భాగంగా ఈనెల 27న గజపతి నగరం, నరసాపురం, తిరుపతి, 28న భీమిలి, చీరాల, పొద్దుటూరు, 30న పాడేరు, దెందులూరు, ఉదయగిరిలో యాత్ర కొనసాగుతుంది. ఈనెల 31న క్యాబినెట్ సమావేశం ఉండటంతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి నవంబర్ 1న పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి, 2న మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు, 3న నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి, 4న శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం, 6న గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం, 7న రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ, 8న సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్‌లో కొనసాగుతుంది. నవంబర్ 9న అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లెలో యాత్ర ముగుస్తుంది. సామాజిక సాధికార యాత్ర డిసెంబర్ 31 వరకు అంటే.. మొత్తంగా 60 రోజుల పాటు బస్సు యాత్ర జరుగనుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను కొనసాగే విధంగా షెడ్యూల్ తయారు చేశారు.
పూర్తి షెడ్యూల్:
* ఈనెల 26 నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
– గురువారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం…
– గుంటూరు జిల్లా తెనాలి…
– అనంతపురం జిల్లా శింగనమల నుంచి బస్సు యాత్ర
– ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి బస్సు యాత్ర షెడ్యూల్ మొదలు
– 200 మంది ఒకచోట సమావేశమై సామూహిక భోజనాలు
– నిర్దేశిత రూట్ మ్యాప్‌లో బస్సు ప్రయాణం
– సాయంత్రం బహిరంగ సభ
– ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో 3 బహిరంగసభలు
– నవంబర్ 9 వరకు ఫస్ట్ ఫేజ్ సామాజిక సాధికార బస్సు యాత్ర
– ఈనెల 27న గజపతి నగరం, నరసాపురం, తిరుపతి…
– ఈనెల 28న భీమిలి, చీరాల, పొద్దుటూరు…
– ఈనెల 30న పాడేరు, దెందులూరు, ఉదయగిరిలో యాత్ర
– ఈనెల 31న క్యాబినెట్ భేటీ కారణంగా యాత్రకు బ్రేక్
– నవంబర్ 1న పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి…
– నవంబర్ 2న మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు…
– నవంబర్ 3న నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి…
– నవంబర్ 4న శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం…
– నవంబర్ 6న గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం…
– నవంబర్ 7న రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ…
– నవంబర్ 8న సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్‌లో యాత్ర
– నవంబర్ 9న అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లెలో యాత్ర ముగింపు
– డిసెంబర్ 31 వరకు మొత్తం 60 రోజుల పాటు యాత్ర
– ప్రతి నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర
తాజావార్తలు
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?