టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. చంద్రబాబు బాగోతం కొద్దీ రోజులుగా బయట పడుతోందని .. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా ఆయన దొంగలా తిరుగుతున్నారని ఎంపీ తీవ్రంగా మండిపడ్డారు.
రాజధాని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలకు హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.