Gorantla Madhav: ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. వైఎస్ జగన్ ని కట్డడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
చంద్రబాబును మించిన క్రిమినల్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరూ లేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, చీకట్లో కాళ్లు పట్టుకోవటంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. తడిగుడ్డతో గొంతులు కోయగల వ్యక్తి చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీలను కొనాలని చూశారన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు…