Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలోని K కన్వెన్షన్ లో వైసీపీ బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి భారీగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, అనారోగ్య కారణాల వల్ల ఈ మీటింగ్ కు దూమాజీ మంత్రి కొడాలి నాని, ఆయన అనుచరులు దూరంగా ఉన్నారు.
High tension in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సభకు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.