Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలను కూటమి ప్రభుత్వం అరికట్టలేకపోతున్నదంటూ చిత్తూరులో వైస్సార్సీపీ మహిళా విభాగం నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరు చూస్తుంటే మనం భారతదేశంలో ఉన్నామా..? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా..? అన్న అనుమానం కలుగుతోంది. ఏపీలో ప్రజలు నార్త్ కొరియా తరహా పాలనను అనుభవిస్తున్నారని తీవ్రస్థాయిలో…