వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిధులను విడుదల చేశారు.
ఏపీ ప్రభుత్వం కొత్తగా పెళ్లి చేసుకున్నవారికి ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేయనున్నారు.