Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో జరిగే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ రెండో విడత నిధుల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయ అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ నంద్యాల జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10:15 గంటలకు ఆయన ఆళ్లగడ్డ చేరుకుంటారు. ఉదయం 10:45 గంటల…