వైఎస్ఆర్ భీమా పథకాన్ని ఈరోజు తాడెపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో కుటుంబపెద్దను కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్టు జగన్ తెలిపారు. 2021-22 సంవత్సరానికి రూ.750 కోట్ల రూపాయలతో భీమా రక్షణ కల్పిస్తున్నట్టు వైఎస్ పేర్కొన్నారు. పేదలపై ఎలాంటి భారం పడకుండా భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు జగన్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని తెలిపారు. కుటుంబ పెద్ద చనిపోతే, ఆ కుటుంబానికి భీమాతో…