కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వైఎస్ఆర్ తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మహేష్ కుమార్ గౌడ్…