తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం మళ్లీ రాజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నీటి వివాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ… తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ”వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే… సీఎం జగన్ గజ దొంగ” అన్న సందర్భాలు ఉన్నాయి. అటు ఏపీ మంత్రులు కూడా అదే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వపై…
పేద వాళ్ల కోసం వైఎస్ ఆరోగ్య శ్రీ పథకం తెచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించారు. అంతకముందు ఒక్క నాయకుడు కూడా ఇలా ఆలోచించలేదు. నా తండ్రిది పెద్ద మనసు అని వైస్ షర్మిల పేర్కొన్నారు. కుటుంబాలని నిలబెట్టిన పథకం అది. కానీ తెలంగాణ లో ఆరోగ్య శ్రీ అందడం లేదు. కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు. పేద వాళ్ళ ను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదు అని అన్నారు. ఫామ్…
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.. ఇప్పటికే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్ చేశారు.. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు. వచ్చే నెలలోనే పార్టీ ఏర్పాటు చేయనున్నారు షర్మిల. అయితే.. ప్రజలకు దగ్గర కావాలనే నేపథ్యంలో వరుసగా జిల్లాల పర్యటనలు షర్మిల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి.. కేటీఆర్ ఇలాకా అయిన రాజన్న సిరిసిల్లాలో…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది రియలో.. ఏది వైరలో తెలియని పరిస్థితి… కొందరు కేటుగాళ్లు ఇష్టంవచ్చినట్టుగా తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు.. అది తెలియకకొందరు.. తెలిసి మరికొందరు షేర్ చేస్తూ.. అందులో భాగస్వాములు అవుతున్నారు.. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్, వైఎస్ షర్మిల ఫొటోలతో.. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఓ తప్పుడు వార్త వైరల్ చేశారు కేటుగాళ్లు.. దీనిపై వైఎస్ షర్మిల అనుచరులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బుధవారం రోజు సోషల్ మీడియాలో మేం పెట్టబోయే…
వైఎస్ షర్మిలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి… షర్మిలమ్మ, మీ కుయుక్తులు, డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని హితవుపలికారు.. ఇవాళ వైఎస్ షర్మిల హుజూర్‌నగర్ నియోజకవర్గం పర్యటనలో నేరేడుచెర్ల మండలం మేడారం వెళ్లారని.. అక్కడ ఒక నిరుద్యోగి కనపడకుండా పోయాడని.. అందుకు శానంపూడి సైదిరెడ్డి కిడ్నాప్ చేయించాడాని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంపై రాష్ట్రం ఏర్పడిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారన్న సైదిరెడ్డి..…
నేడు నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనుంది. పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. మిర్యాలగూడ లోని బంగారు గడ్డలో సలీం కుటుంబానికి పరామర్శించనున్నారు. మేడారంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని ఆత్మహత్యా యత్నం చేసిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం హుజుర్ నగర్ లో వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… కోదాడ సమీపంలోని దొండపాడులో మహానేత వైఎస్‌ఆర్ గారి అనుచరుడు, కుటుంబ…
రేపు సూర్యాపేట జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. హుజుర్ నగర్ లో నీలకంఠ సాయి కుటుంబాన్ని ఈ పర్యటనలో షర్మిల పరామర్శించనున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని మనస్తాపంతో నీలకంఠ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కరోనాతో మృతిచెందిన గుణ్ణం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు షర్మిల. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన నాగిరెడ్డి…వైఎస్సార్ కు వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. రేపు ఉదయం 7.30 గంటలకు లోటస్ పాండ్ నుండి షర్మిల బయలుదేరనున్నారు. కాగా…
కోవిడ్, ధాన్యం కొనుగోళ్లు రెండింటిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యింది అని వైఎస్ షర్మిల తెలిపారు. ధాన్యం పండించిన రైతులు ఇబ్బందులు పడుతుంటే .. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. మొండి నమ్మకంతో గుండె నిబ్బరంతో సాగు చేస్తున్న రైతులు గుండెలు బాదుకునేలా అరుస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. చివరి గింజ వరకు కొంటానని చెప్పిన తర్వాతే కదా రైతులు సాగు చేసింది. బట్టలు మార్చుకునేంత ఈజిగా మాట మారుస్తారా అని ప్రశ్నించిన షర్మిల 80 వేల పుస్తకాలు…
రేపు సంగారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యంను పరిశీలించనున్నారు. ఆ తరువాత అక్కడున్న రైతుల సమస్యల గురించి అడిగి తెలుకుంటారు. తెలంగాణలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేయబోతున్న షర్మిల, పార్టీకి సంబందించిన జెండా, అజెండాను జులై 8 వ తేదీన ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈలోగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలపై పోరాటం చేసేందుకు వైఎస్ షర్మిల సిద్దం అవుతున్నారు. ఇందులో…